MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీకి చెందిన ఈస్పోర్ట్స్ జట్టు ‘మహి క్లచర్స్’.. మోబా లెజెండ్స్ మాస్టర్స్ సిరీస్ (ఎంఎల్‌ఎంఎస్) సీజన్–2లో బరిలోకి దిగనుంది. శుక్రవారం నుంచి గ్రూప్ దశ పోటీలు జరగనున్నాయి. భారత మొబైల్ గేమింగ్ కమ్యూనిటీని ప్రోత్సహించేందుకు గూగుల్ ప్లే, నాడ్విన్ గేమింగ్ సంయుక్తంగా ప్రారంభించిన 'గూగుల్ ప్లే ఎరీనా' ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. రెండో సీజన్‌లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి.
మహి క్లచర్స్ జట్టుతో పాటు ఎస్8యుఎల్ ఈ-స్పోర్ట్స్, గాడ్‌లైక్ ఈ-స్పోర్ట్స్, ఒరంగుటాన్, టీమ్ అపెక్స్ గేమింగ్, రెవెనెంట్ ఎక్స్‌స్పార్క్ వంటి అగ్రశ్రేణి జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. మిథిక్ షోడౌన్ క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించిన క్రక్స్ రెక్వియమ్, షాడో ఈ-స్పోర్ట్స్ జట్లు కూడా బరిలో నిలిచాయి.
