నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా కార్తీక్ దండు తెరకెక్కించిన చిత్రం ‘వృషకర్మ’. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 4న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నెల్లూరులో జరిగిన ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. పురాతన రహస్యాలు, వేద విజ్ఞానం, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఐదు వేల ఏళ్లనాటి ఒక మిస్టీరియస్ శక్తి పరిచయంతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది.
ఒక ట్రెజర్ హంటర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన హీరో నాగచైతన్య.. మానవాళికి ముప్పు కలిగించే ఒక పురాతన శక్తిని ఎదుర్కొని, సృష్టి ధర్మాన్ని కాపాడే ‘వృషకర్మ’గా ఎలా మారాడనేది సినిమాపై ఆసక్తిని రేపింది. నాగ చైతన్య మేకోవర్, యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. మీనాక్షి చౌదరి, కియారా ఖన్నా, జయరామ్ కీలక పాత్రల్లో మెరవగా, విలన్‌గా స్పర్ష్ శ్రీవాస్తవ భయపెట్టాడు. గుహల సెట్స్, సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ ‘కార్తీక్ ఈ కథను చాలా ఒరిజినల్‌గా, ఫ్రెష్‌గా రాశారు. 2 గంటల 50 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో దాదాపు ప్రతి ఫ్రేమ్‌లో వీఎఫ్‌ఎక్స్ ఉంటుంది. మునుపెన్నడూ చూడని అద్భుతమైన విజువల్స్ ఇందులో చూస్తారు. ఈ సినిమాకు ఫస్ట్ హీరో మా దర్శకుడు కార్తీకే. ఇండియా గర్వించే తెలుగు దర్శకుల జాబితాలో కార్తీక్ కూడా చేరబోతున్నారు’ అని చెప్పారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి, విలన్‌గా నటించిన స్పర్శ్ శ్రీవాస్తవ, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.
