కోలీవుడ్ నటుడు రవి మోహన్ (జయం రవి), ఆయన భార్య ఆర్తి రవి మధ్య కొనసాగుతున్న విడాకుల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారంలో సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌కు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్తి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో డిసెంబర్ 3న కెనిషా స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ ఆ రోజు ఆమె హాజరుకాకపోతే, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా అదే రోజు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు కోలీవుడ్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఆర్తి పరువు నష్టం దావా..
సింగర్ కెనిషా తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఆర్తి రవి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను తొలగించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి పోస్టులు పెట్టకుండా ఆదేశించాలని కోరారు. అంతేకాకుండా రూ.1.01 కోట్ల పరిహారం చెల్లించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని పోస్టులను తొలగించాలని కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. తాజాగా సాక్ష్యాల నమోదు కోసం కేసును మాస్టర్ కోర్టుకు బదిలీ చేస్తూ, డిసెంబర్ 3న కెనిషా స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆమె గైర్హాజరైతే అదే రోజు విచారణ ముగించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
పిల్లలను కలిసే హక్కుపైనా వివాదం
మరోవైపు పిల్లలను కలిసేందుకు రవి మోహన్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఆర్తి కుటుంబ న్యాయస్థానాన్ని కోరినట్లు సమాచారం. మధ్యంతర భరణం చెల్లింపులు, పిల్లల భద్రతపై ఆందోళనలను ఆమె తన పిటిషన్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోను కూడా ప్రస్తావిస్తూ, రవి మోహన్‌కు ఇచ్చిన సందర్శన అనుమతిని పునఃపరిశీలించాలని కోరినట్లు కథనాలు వెల్లడించాయి. ఈ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది.
15 ఏళ్ల వైవాహిక బంధం.. విడాకుల దిశగా అడుగులు
రవి మోహన్, ఆర్తి రవి 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. 2024లో రవి మోహన్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం న్యాయపోరాటంగా మారింది. మరోవైపు ఆర్తి నెలకు రూ.40 లక్షల భరణం కోరగా, కుటుంబ న్యాయస్థానం మధ్యంతరంగా రూ.3 లక్షలు చెల్లించాలని రవిని ఆదేశించింది. ప్రస్తుతం విడాకులు, భరణానికి సంబంధించిన కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
డిసెంబర్ 3న ఏం జరగబోతోంది?
కెనిషాపై ఆర్తి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో డిసెంబర్ 3 కీలకంగా మారింది. ఆ రోజు కెనిషా కోర్టుకు హాజరై తన వివరణ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఆమె హాజరుకాకపోతే అదే రోజు విచారణ ముగించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో కెనిషా హాజరుపై కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ కేసుతో పాటు రవి మోహన్, ఆర్తి విడాకులు, భరణం, పిల్లల సందర్శన హక్కులకు సంబంధించిన వివాదాలపై కూడా తదుపరి కోర్టు పరిణామాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఎవరీ సింగర్ కెనిషా ఫ్రాన్సిస్?
తమిళ నటుడు రవి మోహన్ – ఆర్తి విడాకుల వివాదంతో వార్తల్లో నిలుస్తున్న పేరు సింగర్ కెనిషా ఫ్రాన్సిస్. బెంగళూరుకు చెందిన ఆమె గాయని, డ్యాన్సర్, నటి. ప్రముఖ మ్యూజిక్ రియాలిటీ షో 'ది స్టేజ్' సీజన్ 1లో టాప్ 5 ఫైనలిస్టుల్లో చోటు సంపాదించారు. గోవాలో లైవ్ మ్యూజిక్ షోలతో గుర్తింపు తెచ్చుకున్నారు. వెల్నెస్, స్పిరిచువల్ హీలింగ్ రంగాల్లోనూ పనిచేస్తున్నారు.
2024లో రవి మోహన్, ఆర్తి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత కెనిషా పేరు తెరపైకి వచ్చింది. రవితో కలిసి చాలా పబ్లిక్ ఈవెంట్స్ లతో పాటుగా తిరుమలకు వెళ్లడంతో వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ రవి వైఫ్ ఆర్తి..సింగర్ కెనిషాపై రూ.1.01 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో డిసెంబర్ 3న వ్యక్తిగతంగా హాజరు కావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
