మీ పిల్లలు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలంటే.. చిన్నప్పటి నుంచే ఈ అలవాట్లు నేర్పించండి..

మీ పిల్లలు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలంటే..  చిన్నప్పటి నుంచే ఈ  అలవాట్లు నేర్పించండి..

పిల్లలకి చిన్నప్పట్నించే గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి. చిన్నప్పుడు నేర్చుకున్న అలవాట్లే పెద్దయ్యాక వాళ్లలో మెచ్యూరిటీని పెంచుతాయి. డబ్బు విలువ చిన్నప్పటి నుంచే తెలిసేలా చెప్పాలి. అవసరమైన వాటిని మాత్రమే కొనివ్వాలి. ఏ వస్తువు అవసరం ఎంతవరకు ఉందో వాళ్లకి తెలిసేలా చెప్పాలి. అవసరం లేని దాని గురించి క్లారిటీగా చెప్పాలి. ఇలా చేస్తే పిల్లల్లో చిన్నప్పుడే 'ఏది అవసరం ? ఏది కాదు' అనేది తెలుస్తుంది.

పిల్లలకు సంబంధించిన అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ప్రతి సందర్భంలోనూ పిల్లల తరపున తల్లిదండ్రులే మాట్లాడితే పెద్దయ్యాక వాళ్లకు ఎలా మాట్లాడాలో అర్ధం కాదు. అందుకే వాళ్లను మాట్లాడనివ్వాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే కథలు చెప్పాలి. టీవీ చూడటం, సెల్ ఫోన్, ట్యాబ్, లాప్ టాప్  వాడటం మాత్రమే కాకుండా పుస్తకాలు చదివించాలి.  పడుకునేముందు లేదా వాళ్లకు వీలుకుదిరినప్పుడు పిల్లలతో బుక్స్ చదివించాలి.

ALSO READ : చలికాలంలో నీరసంగా.. బద్ధకంగా అనిపిస్తుందా ?

చిన్నచిన్న పనులను వాళ్లతో చేయించాలి. దీనివల్ల పెద్దవాళ్లకు ఎలా సాయపడాలో వాళ్లకు తెలుస్తుంది. మంచి పనులు చేసినప్పుడు ప్రోత్సహించాలి. వీలైతే చిన్న గిఫ్ట్ ఇవ్వాలి. వాళ్లు చేసిన పనిని మెచ్చుకోవాలి.