సమాజంలో కొంచెం పేరు, పలుకుబడి ఉంటే చాలు...మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు ఫీల్ అవుతుంటారు జనం. ఇక పదవి, అధికారం కూడా తోడైతే ఏమైనా ఉందా... తామే సర్వం, తమ మాటే శాసనం అన్నట్లు వ్యవహరిస్తారు కదా... ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అలాగే వ్యవహరించాడు. ఈ ఎమ్మెల్యే వ్యవహారశైలి పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఆటను చేసిన ఘనకార్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆయన బర్త్ డే సందర్భంగా ఉప్పల్-వరంగల్ హైవేపై కేక్ కట్ చేయడంతో గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రైవేట్ స్థలంలో బర్త్ డే వేడుకలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉప్పల్ వరంగల్ హైవేపై కేక్ కట్ చేసి హల్చల్ చేశారు బండారి లక్ష్మారెడ్డి.
హైవేపై కేక్ కటింగ్ అనంతరం పాదయాత్ర కూడా చేపట్టారు లక్ష్మారెడ్డి. ఈ క్రమంలో ఉప్పల్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వాహనదారులు.
ALSO READ : తెలంగాణలో అసెంబ్లీ 179, లోక్ సభ సీట్లు 25
ఈ ట్రాఫిక్ లో ఆంబులెన్సు కూడా చిక్కుకోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా కూడా లా అండ్ ఆర్డర్ పట్ల ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి జాగ్రత్తల తీసుకోలేదని మండిపడుతున్నారు వాహనదారులు, స్థానికులు.
