నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: దేశంలో డీలిమిటేషన్‎కు రంగం సిద్ధమైంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌తో ముడిపడిన రాజ్యాంగ సవరణ బిల్లు మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. గతంలో వీగిపోయిన ఈ బిల్లును ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకునేందుకు మోడీ సర్కార్ పక్కా వ్యూహాం రచించింది. ఈ క్రమంలోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 

శుక్రవారం (నవంబర్ 27) ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు సవరణలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన సీట్లను 2051 వరకు యథాతథంగా (ఫ్రీజ్) ఉండేలా సవరణలు చేశారు. డీలిమిటేషన్ తర్వాత ఏ రాష్ట్రానికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రాతినిధ్య వాటా తగ్గకుండా చర్యలు తీసుకున్నారు. 

ALSO READ : తెలంగాణలో అసెంబ్లీ 179, లోక్ సభ సీట్లు 25: డీలిమిటేషన్‎తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం

లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు ప్రక్రియకు ఇది మార్గం సుగమం చేస్తుంది. 2026, నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ నవంబర్ 30న, రాజ్యసభ డిసెంబర్ 2న సమావేశం కానున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం.