ఆ నలుగురు.. బతికున్నప్పుడు నలుగురితో మంచిగా ఉండాలి అనేది ఎందుకు అంటే.. చచ్చిన తర్వాత మోయటానికి ఆ నలుగురు అయినా ఉంటారు అనే. కాలం మారింది.. కాలంతో పాటే ఆలోచనలు మారాయి. ఇప్పుడు అయితే కడుపున పుట్టినోళ్లే ఖర్మకాండలు చేయటం లేదు.. ఇలాంటి కాలంలో దేశంలో కొత్తగా పుట్టుకొచ్చిందే ఈ స్టార్టప్ కంపెనీ. ఈ స్టార్టప్ కంపెనీ ఏం చేస్తుందో తెలుసా.. శవం చూపిస్తే చాలు.. అన్నీ వాళ్లే చూసుకుంటారు. ఏడవటానికి మనుషులను తీసుకొస్తారు.. మోయటానికి మనుషులను తీసుకొస్తారు.. పూజారి, పూలు, పండ్లు, దుస్తులు, వాహనాలు అన్నీ వాళ్లే తీసుకొస్తారు. శ్మశానంలో కట్టెలు వాళ్లే చూసుకుంటారు. చివరకు చితి పెట్టటానికి కన్నోళ్లు, బంధువులు లేకపోయినా అది కూడా వాళ్లే పెడతారు.. జస్ట్ మనం శవం చూపిస్తే చాలు.. ఇక డబ్బులు అంటారా.. మీరు ప్యాకేజీని బట్టి విలువ ఉంటుంది.. మనుషులు వస్తారు.. 6 వేల రూపాయల నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు ప్యాకేజీ ఉంది.. దేశంలో కొత్తగా పుట్టి ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న అంత్యక్రియల స్టార్టప్ కంపెనీ వివరాలు ఇలా ఉన్నాయి.
సాధారణంగా మనం పెళ్లిళ్లు, టూర్లు, కొత్త ఇల్లు కొనడం వంటి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల కోసం చాలా మంది ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. కానీ జీవితంలో చివరి మజిలీ మరణం.. ఆ తర్వాత జరిగే అంత్యక్రియల గురించి ముందుగానే ఆలోచించడం మన సమాజంలో చాలా అరుదు. ఈ ఆలోచనా విధానాన్ని మార్చడానికి ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ సరికొత్త సేవతో ముందుకు వచ్చింది. ఎవరైనా సరే.. తాము బతికుండగానే తమ అంత్యక్రియల ఏర్పాట్లను ముందుగానే బుక్ చేసుకునే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది.
అసలేంటి ఈ మోక్ష వాయేజ్?
నమో గంగే వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'మోక్ష వాయేజ్' అనే ఢిల్లీ స్టార్టప్, అంత్యక్రియలకు సంబంధించిన సేవలను అందిస్తోంది. ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు కుటుంబ సభ్యులు తీవ్రమైన దుఃఖంలో ఉంటారు. ఆ సమయంలో అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం, సామగ్రిని సమకూర్చుకోవడం వారికి ఎంతో మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు అండగా నిలిచి.. ఆ భారాన్ని తగ్గించడమే ఈ స్టార్టప్ ప్రధాన ఉద్దేశం.
హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగే అంతిమ సంస్కారాలకు అవసరమైన ప్రతి చిన్న విషయాన్ని మోక్ష వాయేజ్ ప్యాకేజీల రూపంలో అందిస్తోంది. మరణించిన వారి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడానికి ప్రత్యేక వాహనం, పాడె మోసేవారు, పూల అలంకరణ వంటివి వీరే సమకూరుస్తారు. అలాగే దహన సంస్కారాలకు అవసరమైన కట్టెలు, ఇతర పూజా సామగ్రిని తమ ఫ్యాకేజీలో అందిస్తారు.
A STARTUP THAT PLANS YOUR FINAL GOODBYE 😃 Imagine booking your own funeral while you are still alive. Sounds like a joke, but a Delhi startup is actually offering this service. From making arrangements to handling the final rituals, they take care of almost everything. And wait till you hear the package price.👀...1/2
— btc_misthi (@misthid3x) November 26, 2026
అస్థికల నిమజ్జనం, శ్రాద్ధ కర్మల్లోనూ సహాయం:
ఈ స్టార్టప్ సేవలు కేవలం దహన సంస్కారాలతోనే ముగిసిపోవు. అంత్యక్రియల తర్వాత నిర్వహించే క్రతువులకు కూడా వీరు పూర్తి సహకారం అందిస్తారు. విధివిధానాలను శాస్త్రోక్తంగా నిర్వహించడానికి పూజారులను ఏర్పాటు చేయడంతో పాటు, చితాభస్మం, అస్థికల నిమజ్జనం కోసం ప్రత్యేక ఘాట్‌లు, పడవలను కూడా బుక్ చేసి పెడతారు. అంతేకాకుండా ఆ తర్వాత నిర్వహించే శ్రాద్ధ కర్మలకు కూడా కావాల్సిన ఏర్పాట్లు ఈ స్టార్టప్ కంపెనీ వాళ్లే చేస్తారు.
ALSO READ : దొరల దోపిడీ, అక్రమాలపై పల్లెల్లో తిరుగుబాటు..
మారుతున్న ఆలోచనా ధోరణి:
విదేశాల్లో 'ప్రీ-ప్లాన్డ్ ఫ్యూనరల్స్' సాధారణ విషయమే అయినా, భారతదేశంలో ఇప్పుడిప్పుడే దీనిపై అవగాహన పెరుగుతోంది. తమ తదనంతరం తమ పిల్లలు, కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని భావించే వారు, అలాగే విదేశాల్లో పిల్లలు ఉండి ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. తల్లిదండ్రులు చచ్చిపోతే కనీసం ఆఖరి చూపులు కూడా వీడియో కాల్స్‌లో చూస్తూ అంతిమ సంస్కారాలు లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షిస్తున్న పిల్లలు ఉన్న ఈ రోజుల్లో ఈ స్టార్టప్ కంపెనీ అందిస్తున్న సేవలు మరణం తర్వాత చాలా మందికి గౌరవప్రదమైన ఆఖరి ప్రయాణంగా నిలుస్తున్నాయి.
