తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలెర్ట్ జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి తిరుమల వెళ్లే భక్తులకు సేవా టికెట్ల టోకెన్ల విడుదల తేదీలను టీటీడీ అధికారులు ప్రకటించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీల వివరాలు షెడ్యూల్ ను టీటీడీ అధికారులు ప్రకటించారు
- నవంబర్ 28: ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల.
- నవంబర్ 30: ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల.
- డిసెంబర్ 1 నుంచి 5 వరకు: ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు ఈ-డిప్‌లో నమోదు చేసుకోవచ్చు.
- డిసెంబర్ 7: మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేటాయింపు.
- డిసెంబర్ 8: ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్ల విడుదల.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది. ఈ రెండు రోజుల్లో అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయించనున్నారు. ఈ రెండు రోజులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేయడం జరిగింది.
ALSO READ : సింహరాశిలో మూడు గ్రహాలు సంచారం.. ఆరు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!
భక్తులు దర్శన టికెట్లు, టోకెన్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
