జెమినీ సురేష్.. బుల్లితెర నటుడే కాదు.. కొన్ని సినిమాల్లో కూడా చేశారు. ఇతనది ఆంధ్రప్రదేశ్ భీమవరం. సినీ, టీవీ ఇండస్ట్రీలో స్థిరపడిన వ్యక్తి. జెమినీ సురేష్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడెందుకు ఇతని గురించి అంటారా.. హైదరాబాద్ ట్రాఫిక్ సిస్టమ్ పై ఈ జెమినీ సురేష్ చేసిన పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతని ఫేస్ బుక్ లో అతను చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. హైదరాబాద్ ట్రాఫిక్ విషయంలో హైదరాబాద్ సిటీ పోలీసులు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ఐటీ కంపెనీలు కలిసి యాక్షన్ ప్లాన్ ఆలోచిస్తున్నాయి.
హైదరాబాద్ సిటీ పోలీసుల ట్రాఫిక్ క్రమబద్దీకరణ ఆలోచనలపై జెమినీ సురేష్ కామెంట్స్ ఏంటో చదవండీ..
కార్లో ఒక్కడే వెళ్తే ఫైనా...ఏంటిరా నాయనా..
బిట్స్ పిలానిలో చదితేనే గాని ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు రావు అనుకుంటా.. ఇక సొంతకార్ని టాక్సీలా నడుపుకోవాలి రోడ్డు మీద నడిచి వెళ్లే వాళ్ళకి పిలిచి మరీ లిఫ్ట్ ఇవ్వాలి..
అన్నా అక్కడ దాకా కార్ ఎక్కరా plz అని.. అడుక్కు తినడానికి అరవై ఆరు మార్గాలు అని..
ఉన్న తిప్పలు చాలవు అన్నట్టు మళ్ళీ ఇదొకటి ముందు రోడ్డు మీద అడుగు అడుగుకి వేసిన స్పీడ్ బ్రేకర్స్ పీకి తర్వాత ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు చేయండి ఎవడిస్తున్నాడు బాసు ఇలాంటి ఐడియాసు..
చదువు ఎక్కవై పిచ్చోళ్ళు అయ్యారు అంట అలాఉంది... ఎం ఫీక లేనప్పుడు ఎం ఫీకకుండా ఉంటే మంచిది..
జెమినీ సురేష్ కామెంట్లపై కొందరు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
రోడ్లపై ఎవరు కనిపిస్తే వాళ్లను.. బాబూ హైటెక్ సిటీ.. జూబ్లీహిల్స్ వస్తావా.. బంజారాహిల్స్ వస్తావా అని సొంత కారు ఉన్నోళ్లు.. ఆటోవాలాలు పిలిచినట్లు పిలవమని కాదు.. కార్ పూలింగ్ చేసుకోండి అని పోలీసుల అర్థం.. ఒకే ఏరియా.. దగ్గర దగ్గర ఆఫీసులు ఉన్నోళ్లు అందరూ కలిసి ఒక కారులో వెళ్లమని పోలీస్ శాఖ ఉద్దేశం అంటున్నారు నెటిజన్లు.
కారులో ఒక్కరే వెళితే జరిమానా అనేది ఇంకా అమల్లోకి రాలేదు.. ఆలోచన మాత్రమే. ట్రాఫిక్ రద్దీపై.. ట్రాఫిక్ క్రమబద్దీకరణపై ఆయా శాఖలు సహజంగా నిరంతరం సర్వేలు, పరిశీలన చేయటం కామన్. అలాంటి పరిశీలనలో కారులో ఒక్కరే.. సింగిల్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న వారి సంఖ్య 60 శాతంపైనే ఉందని తేలింది. ఆ విషయంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ విధంగా ఒక ఆలోచన చేసి ఉండొచ్చు అని.. అంత మాత్రానికే.. అడుక్కు తినటం.. దిక్కుమాలిన ఆలోచనలు అని.. ఏం ఫీక లేనప్పుడు అంటూ యాస, భాషతో వెటకారాలతో జెమినీ సురేష్ కామెంట్స్ చేయటంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
హైటెక్ సిటీ వైపు వచ్చే కార్లల్లో.. 60 శాతంపైనే ఒక్కరే ఉన్నారని.. సింగిల్ గా డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీసులకు రావటం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని.. భవిష్యత్ లో హైదరాబాద్ సిటీ బెంగళూరు సిటీ మాదిరిగా కాకుండా.. ట్రాఫిక్ ఫ్రీగా ఉండేందుకు చర్యలు చేపట్టింది. కొన్ని నెలలు సర్వే చేయటం.. పరిశీలించిన తర్వాత తెలంగాణ పోలీస్ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అవి పత్రికల్లో, టీవీలో, సోషల్ మీడియాలో వచ్చాయి. దీనిపై స్పందించిన జెమినీ సురేష్ గారు.. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారంటున్నారు నెటిజన్లు.. అడుక్కుతినటం.. దిక్కుమాలిన ఆలోచనలు.. ఫీక లేం.. అంటూ తనదైన సినిమా స్టయిల్ వెటకారాలతో పోలీస్ శాఖ ఆలోచనలను ఏకిపారేశారు జెమినీ సురేష్..
వాస్తవ విషయాలకు వస్తే.. మియాపూర్, నిజాంపేట, కూకట్ పల్లి, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు, బీహెచ్ఈఎల్, అశోక్ నగర్.. ఇలాంటి ఏరియాల నుంచి హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఆఫీసులకు వెళ్లే వాళ్లు ప్రతి రోజూ ఈ ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవటం కామన్.. వాళ్లకు అనుభవమే.. 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించటానికి ఆఫీసు టైమింగ్స్ లో మినిమమ్ గంట నుంచి గంటన్నర పడుతుంది. ఇందులో 60 శాతంపైన కార్లలో ఒక్కరే ఉంటున్నారు. కారులో ఒక్కరే కాకుండా ఇద్దరు, మగ్గురు, నలుగురు వచ్చినట్లయితే రోడ్లపై వాహనాలు తగ్గి.. ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది.. జర్నీ టైం కలిసొస్తుంది అనేది హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ ఆలోచన.
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులపై జెమినీ సురేష్.. తన ఫేస్ బుక్ నుంచి చేసిన కామెంట్లపై సోషల్ మీడియా ఆసక్తికర చర్చ నడవటం విశేషం.
