తిరుమల  శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు

తిరుమల  శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు
  •     సమర్పించిన చెన్నై పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు
  •     46 రకాల వేర్వేరు ఆభరణాలు.. కానుకల మొత్తం విలువ రూ.207.6 కోట్లు
  •     ఇందులో 106 కిలోల నగలు, పద్మావతీ అమ్మవారికి 15 కిలోల వస్త్రం
  •     దాతలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు, ఆలయ అధికారులు


హైదరాబాద్, వెలుగు: తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించారు.  గురువారం తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీ ఈవో మద్దాడి రవిచంద్ర, అర్చకులకు ఈ నగలను అందజేశారు. ఇందులో 106 కిలోల బంగారు ఆభరణాలతోపాటు పద్మావతీ అమ్మవారికి సమర్పించిన 15 కిలోల బరువైన వస్త్రం కూడా ఉంది. ఈ కానుకల మొత్తం విలువ రూ.207.6 కోట్లు. ఇందులో మూడు బంగారు పాదకవచములు, మూడు బంగారు అందెలు, బంగారు పాకడాలతో పాటు, నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం, వజ్రాలను పొదిగిన ఆభరణాలు ఉన్నాయి.

అనంతరం జైన్ దంపతులను సీఎం, టీటీడీ ఈవో ఘనంగా సన్మానించారు. జైన్ దంపతులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. డబ్బు, సంపద, హోదా ఎప్పటికీ శాశ్వతం కాదని, ఆధ్యాత్మికత, ధర్మం, సేవా భావమే మనిషికి అసలైన సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తాయని చంద్రబాబు అన్నారు.  దాతృత్వాన్ని చాటుకున్న  వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు అందరికీ ఆదర్శమని కొనియాడారు. భక్తులు సమర్పించే ప్రతి రూపాయినీ టీటీడీ వారి సౌకర్యాలు, సేవలకే ఖర్చు చేస్తోందన్నారు. టీటీడీ సహకారంతో దేశంలోని అన్ని రాజధానులతో పాటు విదేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని సీఎం వెల్లడించారు.   

వర్ధమాన్ జైన్.. హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పారిశ్రామికవేత్త 

యాక్సెస్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ అయిన వర్ధమాన్ జైన్.. హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ అవుట్​సోర్సింగ్ (బీపీఓ) రంగాల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. గతంలో డెల్ సర్వీసెస్ బీపీఓ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. విజన్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్స్ సంస్థ స్థాపనలో భాగస్వామిగా ఉన్నారు.