అండాల దందా వెనుక  అదృశ్య శక్తులు!పోలీసుల దర్యాప్తులో సంచలన అంశాలు

అండాల దందా వెనుక  అదృశ్య శక్తులు!పోలీసుల దర్యాప్తులో సంచలన అంశాలు
  •     పోలీసు విచారణతో వెలుగులోకి ఆసక్తికర అంశాలు
  •     తాజాగా ఒయాసిస్​, సద్గురు హెల్త్ కేర్ ఆఫీసుల్లో పోలీసుల సోదాలు
  •     సద్గురు నుంచి ఒయాసిస్ మధ్య రూ. కోట్లలో లావాదేవీలు?
  •     పరారీలో సద్గురు ఫౌండర్ డైరెక్టర్ సూర్య కిరణ్ గేదెల
  •     ఆయనకు రాష్ట్రంలోని ఓ ప్రముఖ నాయకుడితో దోస్తీ
  •     వ్యాపార సంబంధాలు కూడా ఉన్నట్టు ఆరోపణలు!

 

హైదరాబాద్​, వెలుగు: అండాల అక్రమ దందా కేసు కీలక మలుపులు తిరుగుతున్నది. దర్యాప్తులో భాగంగా పోలీసులు తీగ లాగుతున్న కొద్దీ తెర వెనుక ఉన్న అదృశ్య శక్తులు బయటపడ్తున్నాయి. ఇన్నాళ్లూ ఈ వ్యవహారం ఏజెంట్లు, ఫెర్టిలిటీ సెంటర్లు, ఏఆర్టీ క్లినిక్​ల నిర్వాహకుల వరకే పరిమితమైందని భావించగా, ఇప్పుడు అక్రమార్కులకు రాజకీయ అండ కూడా ఉందనే సాక్ష్యాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గురువారం ఒయాసిస్‌ ఫెర్టిలిటీ, ‘సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కార్యాలయాలు, సంస్థ కో ఫౌండర్​, ఎండీ సూర్యకిరణ్‌ గేదెల  సహా పలువురు డైరెక్టర్ల నివాసాల్లో మల్కాజిగిరి పోలీసులు సోదాలు చేశారు. 


ఈ క్రమంలోనే  ఒయాసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించే సద్గురు హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మేనేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిరణ్​కు, గత ప్రభుత్వ హయాంలో సెకండ్​ పవర్​సెంటర్​గా చక్రం తిప్పిన ఓ నేతకు ఉన్న  రాజకీయ సంబంధాలు, వ్యాపార లావాదేవీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ నేత అండదండలతోనే సూర్యకిరణ్​చెలరేగిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

ఆ సంస్థల మేనేజింగ్​డైరెక్టర్​గా సూర్యకిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

అండాల దందా కేసులో పరారీలో ఉన్న నిందితులు డాక్టర్ దుర్గా జీ రావు, గేదెల వెంకట సూర్యకిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి 2009లో బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒయాసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి కేంద్రాన్ని ప్రారంభించారు. సంస్థ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూర్యకిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, దుర్గా రావును మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేర్కొన్నారు. సద్గురు కంపెనీ వివరాల్లోనూ 2009 జూలై 1 నుంచి సూర్య కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నమోదయ్యారు. అక్రమ అండాల సేకరణ వ్యవహారంలో సద్గురు, దుర్గారావు, ఇతరులపై ఇప్పటికే ఐదు  కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అండాల విక్రయం ఆరోపణల్లో సూర్య కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  ఒయాసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించక ముందు సూర్య కిరణ్ లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకుల టెక్నాలజీ ప్రాజెక్టుల్లో పనిచేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన యూకే పౌరుడు. గుంటూరుకు చెందిన సూర్యకిరణ్ మన రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్య నాయకుడికి సన్నిహితుడిగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు నేతతో జరిగిన వ్యాపార లావాదేవీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.  సూర్యకిరణ్​ ప్రస్తుతం తమకు అందుబాటులో లేరని, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెయిలబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని పోలీసులు చెప్తున్నారు. 

ఒయాసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సద్గురు హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారీగా నగదు బదిలీ? 

మరోవైపు ఒయాసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకలాపాలకు సంబంధించిన కోట్ల రూపాయలు సద్గురు హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదిలీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒయాసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించేది సద్గురు హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో డబ్బు ఏయే ఖాతాల మధ్య బదిలీ అయింది? ఏ సేవల కోసం చెల్లించినట్లు చూపారు? మహిళలను సమీకరించిన ఏజెంట్లకు ఎవరు చెల్లించారు? అన్న వివరాలు కీలకంగా మారాయి. అండాల సేకరణ తేదీలు, వైద్య రికార్డులు, బ్యాంకు లావాదేవీలను పోల్చితే చెల్లింపుల పై క్లారిటీ వచ్చే అవకాశముందని పోలీసులు చెప్తున్నారు. 

సోదాల్లో హార్మోన్​ ఇంజెక్షన్లు..

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు రూ.50 వేల వరకు ఇస్తామని ఆశపెట్టి హైదరాబాద్ ​తీసుకువచ్చిన ఏజెంట్లు ఈ దందాలో దింపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్థానికంగా హాస్టళ్లలో ఉంచి, ఫెర్టిలిటీ కేంద్రాలకు పంపి అండాలు సేకరించినట్లు బయటపడింది. కాగా సోదాల్లో భాగంగా పోలీసులు హార్మోన్‌ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంజెక్షన్లు మహిళలకు ఇచ్చారా? అండాలు సేకరించే ముందు వారి సమ్మతి తీసుకున్నారా? దాతల వివరాలు తప్పుగా నమోదు చేశారా? ఆధార్‌ సహా గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేశారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.