తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో TG SAFE డ్రగ్స్ వింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ వింగ్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం ( నవంబర్ 26 ) నిర్వహించిన ఈ తనిఖీలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల్లో అబార్షన్ కిట్ల అక్రమ అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పలు మెడికల్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు అదికారులు. Mifepristone, Misoprostol టాబ్లెట్ల విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు అధికారులు.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 138 మెడికల్ షాపుల్లో అక్రమాలు గుర్తించామని తెలిపారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని... డ్రగ్ లైసెన్సుల రద్దుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.
