కోర్టు ధిక్కరణపై సీఎస్‌‌‌‌కు హైకోర్టు నోటీసులు..డిసెంబర్ 23న హాజరవ్వాలని ఆదేశం

కోర్టు ధిక్కరణపై సీఎస్‌‌‌‌కు హైకోర్టు నోటీసులు..డిసెంబర్ 23న హాజరవ్వాలని ఆదేశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కోర్టు ఆదేశాల అమలులో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రెండేళ్ల క్రితం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో సీఎస్‌‌కి సుమోటోగా నోటీసులు జారీ చేసింది. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాకు చెందిన ముగ్గురు మున్సిపల్‌‌‌‌ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని 2024లో ఇచ్చిన ఆదేశాలు అమలుకాకపోవడంతో ఈ పిటిషన్‌‌‌‌ దాఖలైంది. అప్పట్లో పురపాలకశాఖ కార్యదర్శిగా ఉన్న దానకిశోర్‌‌‌‌ బుధవారం కోర్టుకు హాజరై, ఉత్తర్వుల అమలుకు చర్యలు చేపట్టినట్లు అఫిడవిట్‌‌‌‌ సమర్పించారు. 

అధికారంలో ఉన్న సమయంలో ఆదేశాలను అమలు చేయకుండా, పదవీ విరమణ తర్వాత చర్యలు తీసుకుంటున్నామని చెప్పడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉత్తర్వుల అమలు బాధ్యత సీఎస్‌‌‌‌పై ఉన్నందున ఆయనను కేసులో ప్రతివాదిగా చేర్చారు. డిసెంబరు 23న వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని ఆదేశించారు.