హైదరాబాద్, వెలుగు: మూసాపేట పరిధిలోని 3.15 ఎకరాలను ఈ నెల 27న వేలం వేయాలని జిల్లా కలెక్టర్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త మాధవరం కాంతారావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు.
బాలానగర్ నుంచి పటాన్‌చెరు వరకు విస్తరించిన పలు పారిశ్రామిక ప్రాంతాలకు ఈ స్థలం అనుసంధానంగా ఉందన్నారు. ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగించే ట్రక్కులు, ఇతర భారీ వాహనాల పార్కింగ్‌కు ఇది అవసరమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.
