హైదరాబాద్, వెలుగు: ఆధార్ కార్డు లేని విద్యార్థి జేఈఈ మెయిన్స్-2027 పరీక్షకు సీజీహెచ్ఎస్ గుర్తింపు కార్డుతో దరఖాస్తు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కార్డును ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రంగా పరిగణించి దరఖాస్తును స్వీకరించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఆదేశించింది. కొండాపూర్‌కు చెందిన నితీష్ చంద్ర ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు.
ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని డిజీలాకర్ ద్వారా పూర్తి చేయాల్సి ఉండటంతో దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు.. విద్యార్థి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని, సీజీహెచ్ఎస్ గుర్తింపు కార్డుతో దరఖాస్తును స్వీకరించాలని ఎన్టీఏను ఆదేశించారు.
