హైదరాబాద్ లోని సూరారంలో ఉన్న ఫ్లిప్ కార్ట్ హబ్ లో భారీ చోరీ జరిగింది. గురువారం ( నవంబర్ 26 ) ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించగా.. ఈ భారీ మోసం వెలుగులోకి వచింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సూరారంలోని లక్ష్మీనగర్ ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో నిర్వహించిన ఇంటర్నల్ ఆడిట్ లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డెలివరీల పేరిట వస్తువులను బయటికి తీసుకెళ్లి సొంతానికి వాడుకున్నాడు ఓ డెలివరీ బాయ్.
బీహార్ కి చెందిన మహమ్మద్ జియావుల్ లక్ష్మీనగర్ లోని ఫ్లిప్ కార్ట్ హబ్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో డెలివరీ చేయాల్సిన వస్తువులను సొంతానికి వాడుకొని భారీ మోసానికి పాల్పడ్డాడు జియావుల్. ఇవాళ నిర్వహించిన ఇంటర్నల్ ఆడిట్ లో ఈ భారీ మోసం బయటపడింది.
నిందితుడి దగ్గరి నుంచి 2 సెల్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, వాచ్, దుస్తులు,రూ.లక్ష విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫ్లిప్ కార్ట్ హబ్ నిర్వాహకులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరో ముగ్గురు అనుమానితులు రమేష్, బాలసూర్య, సంజయ్ పాత్రపై ముమ్మరంగా విచారణ జరుపుతున్నామని తెలిపారు.డెలివరీ బాయ్స్ విధుల్లో నిజాయితీగా ఉండాలని..సంస్థ ఆస్తులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
