జ్యోతిష్యం: సింహరాశిలో మూడు గ్రహాలు సంచారం.. ఆరు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!

జ్యోతిష్యం:  సింహరాశిలో మూడు గ్రహాలు సంచారం.. ఆరు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురుడు, బుధుడు, కుజుడు గ్రహాల సంచారం ఆధారంగా  ఆరు రాశులకు శుభ యోగం పట్టబోతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం నవంబర్​ 28 న  ఉదయం 11.37 నిమిషాలకు  కుజుడు, గురుడు, కేతువు సింహరాశి.. మఖ నక్షత్రంలో కలవడం వలన త్రిగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ కూటమి సంచారం 2027 డిసెంబర్​ 5 వ తేదీ వరకు కొనసాగుతుంది.  దీని ప్రభావం వలన ఆను రాశుల వారికి(మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక) వ్యక్తిగత జీవితంలో మార్పులు రావడంతో ఉద్యోగం.. వ్యాపారం.. ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని  జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. . .!

మేషరాశి:సింహరాశిలో నవంబర్​ 28న  ఏర్పడిన గ్రహస్థితితో ఏర్పడిన త్రిగ్రహ కూటమి వలన  ఈ రాశి వారి  కెరీర్‌లో ఊహించని మార్పులు కలుగుతాయి. ప్రతి విషయంలో కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి.  ధన, సంపదల్లో వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. సమాజంలో కీర్తి.. గౌరవం.. ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడంతో .. ఇబ్బందులు తీరుతాయి.  కొన్ని కొత్త వనరులు ఏర్పడుతాయి.  కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి.  ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది.  ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం ... కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది.  అనుకోకుండా లాభాలు వస్తాయి. బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదురుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

వృషభరాశి: సింహరాశిలో కుజుడు, గురుడు, కేతువు కలిసి సంచారం వలన ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఒకటికి రెండుసార్లు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.అప్పుల సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.  సొంతింటిని ఏర్పరచుకొనేందుకు ప్లాన్​ వేస్తారు.  ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారం కోసం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.  చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తాయి.  ఈ రాశి వారు గతంలో నిలిచిపోయిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కర్కాటకరాశి: సింహరాశిలో( కుజుడు, గురుడు, కేతువు) మూడు గ్రహాలు కలిసి సంచారం వలన  ఈ రాశి వారు సంపన్నులయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి  ఆకస్మిక ధన లాభం వస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.వృత్తి పరంగా లైఫ్​ లో సక్సెస్​ సాధిస్తారు. కెరీర్​ లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతులవుతారని పండితులు చెబుతున్నారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

 సింహరాశి: ఇదేరాశిలో గ్రహాల కూటమి ( నవంబర్​ 28న) ఏర్పడబోతుంది.  మూడు గ్రహాలు (కుజుడు, గురుడు, కేతువు) కలిసి సంచారం వలన ఈ రాశి వారికి  ఏ పని తలపెట్టినా ఇబ్బంది లేకుండా  పూర్తవుతుంది.  కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.  ఆఫీసర్ల మద్దతు పుష్కలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు బాగా పెరుగుతాయి.సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారని  పండితులు చెబుతున్నారు. 

తులారాశి: సింహరాశిలో త్రిగ్రహ కూటమి  ప్రభావం వలన ఈ రాశి  ఉద్యోగులకు కొత్త బాద్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల సహకారంతో ముఖ్యమైన పనులను సజావుగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకునే మీ లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  వృత్తిపరమైన పురోగతికి మంచి అవకాశాలను కల్పించవచ్చు. . ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.అప్పుల సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.  సొంతింటిని ఏర్పరచుకొనేందుకు ప్లాన్​ వేస్తారు.  ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

 వృశ్చికరాశి:సింహరాశిలో త్రిగ్రాహి యోగం వలన ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.  ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. .  ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.  మూడు గ్రహాల అనుకూల స్థితి వలన ఈ రాశి వారికి ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి.  ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.