పేదలకు గుడ్ న్యూస్ : ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ

పేదలకు గుడ్ న్యూస్ : ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ

 పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక రోజు ముందే పెన్షన్లు పంపిణీ చేయాలని  ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.  2026 నవంబర్ 30, డిసెంబర్ 1న లబ్ధిదారుల ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ చేయాలని సూచించింది. 

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 61 లక్షల 46 వేల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. పెన్షన్ల పంపిణీ కోసం రూ.2 వేల707 కోట్ల30  లక్షల నిధులు విడుదల చేసింది. నవంబర్ 30న బ్యాంకుల నుంచి నగదు విత్‍ డ్రా చేయాలని ఆదేశించింది. అదేరోజు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. 

నవంబర్ 30న పంపిణీ చేయగా మిగిలిపోయినవారికి డిసెంబర్ 1న పెన్షన్లు అందజేయాలని సూచిచింది. ఎన్నికల విధులకు సిబ్బంది హాజరుకావాల్సి ఉండటంతో సెర్ప్ ఈ  నిర్ణయం తీసుకుంది.