డీలిమిటేషన్ బిల్లు:  సీట్లు 50 శాతం పెంపు ఫార్ములా వల్ల.. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం

డీలిమిటేషన్ బిల్లు:  సీట్లు 50 శాతం పెంపు ఫార్ములా వల్ల.. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం

ముడిపడిన రాజ్యాంగ సవరణ బిల్లు మళ్లీ పార్లమెంట్ ముందుకు రానుందా? ఈ నెల 30 నుంచి పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్రం నిర్ణయించడంతో ఈ చర్చ మొదలైంది. లోక్‌సభను 30న (సోమవారం), రాజ్యసభను డిసెంబర్ 2న (బుధవారం) తిరిగి సమావేశపరచాలని స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కేంద్రం కోరింది. ‘అత్యవసర ప్రభుత్వ వ్యవహారాల’ కోసం ఈ సిట్టింగ్ జరుగుతుందని, వ్యవహారాలను బట్టి డిసెంబర్ 3న రెండు సభలూ ముగిసే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం ‘ఎక్స్’లో ప్రకటించారు. 

సీట్లు 50 శాతం పెంపు ఫార్ములా?

రాష్ట్రాలన్నింటిలో లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ సీట్లను 50 శాతం పెంచే ఫార్ములాను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న సీట్ల వాటాను అలాగే కొనసాగించి, డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలకు పరిష్కారం చూపాలన్నది ఈ ఫార్ములా ఉద్దేశం. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

దక్షిణాదికి నష్టం: కాంగ్రెస్

డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అన్ని పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయంతో తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మార్గాన్ని సూచిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గత ఏడు నెలల్లో నాలుగుసార్లు (ఏప్రిల్ 11, జులై 16, ఆగస్టు 27, అక్టోబర్ 16) ప్రధానికి లేఖలు రాసినా కనీస స్పందన కూడా లేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ విమర్శించారు. ‘డీలిమిటేషన్ బిల్లుల కోసం మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు సామ, దాన, భేద, దండోపాయాల్లో చివరి మూడూ ప్రయత్నించి విఫలమయ్యారు. మొదటిదాన్ని (చర్చలతో ఒప్పించడం) ఎందుకు ప్రయత్నించరు?’ అని ఎద్దేవా చేశారు. ప్రస్తుత 543 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ సీట్లు, రాష్ట్రాలవారీ పంపకం యథాతథంగా ఉంచాలని, మహిళలకు 182 సీట్లు రిజర్వ్ చేయాలని, ఈ నిబంధనలను 25 ఏండ్ల పాటు ఫ్రీజ్ చేయాలని కాంగ్రెస్ నాలుగు సూత్రాల ఫార్ములా ప్రతిపాదిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జనగణన ఫలితాలు రానుండటంతో ఆర్టికల్ 82 ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుందని, అది దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నష్టం చేస్తుందని, అందుకే ఏకాభిప్రాయం తప్పనిసరి అని జైరాం రమేశ్ అన్నారు.