తొలి రోజు చెమటోడ్చిన భారత బౌలర్లు.. మొదటి రోజు కివీస్ భారీ స్కోర్

తొలి రోజు చెమటోడ్చిన భారత బౌలర్లు.. మొదటి రోజు కివీస్ భారీ స్కోర్

IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 246/5 పరుగులు చేసింది. ఈరోజు ( శుక్రవారం, నవంబర్ 27, 2026) టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) బౌలింగ్ తీసుకోగా, తొలి రెండు సెషన్లలో భారత బౌలర్లు పైచేయి సాధించారు. ముఖ్యంగా టీ విరామానికి కివీస్ 131/4తో కష్టాల్లో పడింది. కానీ ఆ తర్వాత టామ్ బ్లండెల్ (53), గ్లెన్ ఫిలిప్స్ (36) భాగస్వామ్యంతో నిలదొక్కుకుని, ఆట ముగిసే వరకు మరో వికెట్ పడకుండా న్యూజిలాండ్‌ను సురక్షిత స్థితిలో నిలిపారు. 

ఆఖర్లో బ్లండెల్, ఫిలిప్స్ దూకుడు: 

* భారత బౌలర్ల పంచ్: తొలి సెషన్‌లో ఓపెనర్లు జాగ్రత్తగా ఆడగా, లంచ్‌కు ముందు చివరి బంతికి అరంగేట్ర పేసర్ గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) డెవాన్ కాన్వే (31)ను ఔట్ చేసి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత రెండో సెషన్‌లో భారత బౌలర్లు 3 వికెట్లు తీసి కివీస్‌ను 131/4 దగ్గర నిలిచిపోయింది. 

* లాథమ్ హాఫ్ సెంచరీ.. ఆకాశ్ దీప్ దెబ్బ: కెప్టెన్ టామ్ లాథమ్ (128 బంతుల్లో 59) టాప్ ఆర్డర్‌లో నిలదొక్కుకోగా, అతడిని ఆకాశ్ దీప్ పెవిలియన్ చేర్చాడు. ఆకాశ్ దీప్ రోజు మొత్తంలో 2 వికెట్లు తీశాడు. డారిల్ మిచెల్ కూడా 31 పరుగులు చేసి ఔటయ్యాడు.

* చివరి సెషన్‌లో కివీస్ రీఎంట్రీ: నాలుగో వికెట్ పడిన తర్వాత టీమిండియా పూర్తి పట్టు సాధించేలా కనిపించినా, టామ్ బ్లండెల్ (53 నాటౌట్) అర్ధశతకంతో, గ్లెన్ ఫిలిప్స్ (36 నాటౌట్) అండతో వికెట్ కాపాడుకున్నారు. దీంతో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ 246/5 వద్ద నిలిచింది.

* టీమిండియా బౌలర్లు: ఇక రెండో టెస్టులో భారత బౌలర్లు మొదట్లో బాగానే వికెట్లు తీసుకున్నప్పటికీ, మూడో సెషన్ లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చాడు. వికెట్లేమి తీసుకోకపోగా, భారగా పరుగులు సమర్పించుకున్నారు. ఆకాష్ దీప్ 2 వికెట్లు తీసుకోగా, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు.  

గుర్నూర్ బ్రార్ అరంగేట్రం.. మారని కివీస్ XI: 

* భారత్ జట్టులో మార్పులు: ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో యువ పేసర్ గుర్నూర్ బ్రార్ కి టెస్ట్ క్యాప్ అందిస్తూ టీమిండియా ఒకే మార్పుతో బరిలోకి దిగింది.

* న్యూజిలాండ్ XI: తొలి టెస్ట్ ఆడిన తుది జట్టునే న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది.