Tilak Varma: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (Asia Cup Rising Stars) 2026 సెమీఫైనల్లో శ్రీలంక-A (Sri Lanka A) చేతిలో భారత్-A (India A) ఎదుర్కొన్న ఘోర పరాజయంపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న (నవంబర్ 26, గురువారం) ఖతార్‌లోని దోహా వేదికగా వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఇండియా A 317/8 భారీ స్కోరు సాధించినప్పటికీ, 8 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma) నాయకత్వంపై, టీమ్ మేనేజ్‌మెంట్ ఎంపిక చేసిన తుది జట్టుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.
ఇంత దారుణంగా ఓడిపోతారా:
దోహా పిచ్ నెమ్మదిగా ఉండటంతో 317 పరుగుల స్కోరు చేసిన భారత్-A సులభంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ శ్రీలంక ఓపెనర్లు లసిత్ క్రూస్‌పుల్లె, సినెత్ జయవర్ధనే సెంచరీలతో విరుచుకుపడి, కేవలం 41.3 ఓవర్లలోనే 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* తిలక్ కెప్టెన్సీపై ప్రశ్నలు: ఐపీఎల్‌లో రెండు మూడేళ్లుగా ఆడుతున్న ప్లేయర్స్, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్లు జట్టులో ఉండి కూడా ఎలా ఓడిపోతారంటూ ఒక అభిమాని ప్రశ్నించాడు. మ్యాచ్ చేజారుతున్న సమయంలో తిలక్ వర్మ కెప్టెన్సీ ఏమాత్రం ఆకట్టుకోలేదని విమర్శించాడు.
* కేవలం 2 వికెట్లు: 318 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో టీమిండియా బౌలర్లు కనీసం పోరాట పటిమ చూపకుండా కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలగడం అభిమానులను మరింత నిరాశపరిచింది.
10వ నంబర్ వరకు బ్యాటర్లే.. మరీ బౌలర్లు ఎక్కడ:
* ఈ ఓటమితో భారత్ -A జట్టు కూర్పులోని లోపాలు మరోసారి బయటపడ్డాయని విశ్లేషకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
* స్పెషలిస్ట్ బౌలర్ల కొరత: భారత జట్టులో పదో నంబర్ వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఉన్నారు. కానీ ప్రత్యేక నైపుణ్యం కలిగిన స్పెషలిస్ట్ బౌలర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయంటూ మరో అభిమాని ఘాటుగా స్పందించాడు.
* ఇండియా మేనేజ్‌మెంట్‌పై ప్రశ్నలు: భారీ బ్యాటింగ్ లైనప్‌ను ఎంపిక చేసిన టీమ్ మేనేజ్‌మెంట్, బౌలింగ్ విభాగాన్ని ఎందుకు పటిష్టంగా ఏర్పాటు చేయలేదని నెటిజన్లు నిలదీస్తున్నారు.
- Abhishek Sharma. ✅ - Vaibhav Sooryavanshi. ✅ - Tilak Verma. ✅ - Rinku Singh. ✅ - Harshit Rana. ✅ India had their strongest team, yet lost to Sri Lanka with 9 overs still left. What a humiliating defeat. https://t.co/ZOvsmrx6hC
— Sheri. (@CallMeSheri1_) November 26, 2026
We have lost. India is out of the tournament. Thanks to mindless selection by @BCCI and this obsession with playing all rounders in place of proper bowlers. @GautamGambhir has brought more harm then good for the Indian team.
— APal (@AjayendraPal) November 26, 2026
India A had batting till Number 10 today FYI. Pretty sire this is what is going to happen if we do not start putting specialist bowlers over average bowlers who can hold a bat.
— Yash (@Datascientist1_) November 26, 2026
