మనోజ్, శృతి, మోహన సిద్ధి జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో సావిత్రమ్మ చెరుకూరి నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మనోజ్ మాట్లాడుతూ.. నగరాలకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించే యువత ఎదుర్కొనే సమస్యలే ఈ చిత్ర కథాంశమని చెప్పాడు.
ఇందులో అల్లరి పిల్లగా కనిపిస్తానని శృతి మోహన సిద్ధి చెప్పింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా కామెడీ, ఎమోషన్, లవ్, ఫ్యామిలీ డ్రామా అంశాలతో సినిమాను రూపొందించామని దర్శకుడు రమేష్ బాబు చెరుకూరి అన్నారు. సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని టీమ్ చెప్పారు.
