ఆకాశంలో ఒక తార ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తోంది: అల్లు అరవింద్

ఆకాశంలో ఒక తార  ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తోంది: అల్లు అరవింద్

‘ఆకాశంలో ఒక తార’  ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తూ రెండో వారం కూడా మరింత సక్సెస్‌‌ఫుల్‌‌గా రన్ అవుతోందని  నిర్మాత  అల్లు అరవింద్ అన్నారు.   దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ చిత్రం  నవంబర్ 20న విడుదల కాగా, ఇప్పటికీ   ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని టీమ్ చెప్పింది. 

ఈ సందర్భంగా   నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి చాలా అవార్డులు కూడా వస్తాయనే నమ్మకంతో ఉన్నామని అన్నారు.  దర్శకుడు పవన్, నిర్మాత స్వప్న, రచయిత గంగరాజు, హీరోయిన్ సాత్విక వీరవల్లి సహా టీమ్ అంతా సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.