ఫూలే పోరాటం స్ఫూర్తిదాయకం.. నవంబర్ 27న విడుదల

ఫూలే పోరాటం స్ఫూర్తిదాయకం.. నవంబర్ 27న విడుదల

మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఫూలే’.  ప్రతీక్ గాంధీ , పత్రలేఖ లీడ్ రోల్స్‌‌లో అనంత్ నారాయణ్ మహదేవన్ తెరకెక్కించారు.  ఇప్పటికే హిందీలో విడుదలైన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ బ్యానర్‌‌పై డా. పొన్నం రవిచంద్ర నిర్మించారు. ఏషియన్ సినిమాస్ ద్వారా నవంబర్ 27న  విడుదలవుతోంది.  తెలుగు వెర్షన్‌‌కు చేతన్ కత్తి  డైలాగ్స్  అందించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు.  గురువారం హైదరాబాద్‌‌లో  ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ నిర్వహించారు.  

తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఫూలే దంపతుల ఆశయాలను, జీవిత కథను  తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం గర్వంగా ఉందని ప్రతీక్ గాంధీ చెప్పారు.  మహిళా విద్య,  సమానత్వం,  సామాజిక చైతన్యాన్ని చాటిచెప్పే ఈ సినిమా  గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం చేరువ కావాలని నిర్మాత పొన్నం రవిచంద్ర అన్నారు.  కార్యక్రమంలో పాల్గొన్న   తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ,  నిర్మాత మధుర శ్రీధర్, ఎం.ఎం.శ్రీలేఖ,  నటుడు రచ్చ రవి, ఐఏఎస్ అధికారి శ్యామ్ ప్రసాద్ లాల్..  ప్రతి ఒక్కరిలోనూ సామాజిక చైతన్యాన్ని నింపే చిత్రమిదని చెప్పారు.