ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి

ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి

హైదరాబాద్, వెలుగు: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజిలీ రెడ్డి వివాహం -బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. బెంగుళూరు సమీపంలోని నందిహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గల ‘మగధీర’ రిసార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల సన్నిహితులు, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కూతురు వివాహం ఫొటోలను షర్మిల ‘ఎక్స్’​లో పోస్ట్​ చేశారు. 

“నాన్న వైఎస్ ఆర్  దీవెనలతో, అమ్మ ఆశీస్సుల మధ్య, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో నా బిడ్డ  వైఎస్​ అంజిలీ రెడ్డి-, సోమల రఘురామ్ రెడ్డి వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అంజిలి, రఘులకు ఆ దేవుని శుభాశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు!” అని పేర్కొన్నారు.