రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఇంప్రెస్ చేశాడు కేరళకు చెందిన కుర్రోడు. ఏదో స్కూల్ పిల్లోడు అభిమానంతో కలిసినట్లుగా కాకుండా.. పుతిన్ తో పాటు, కజకిస్థాన్ అధ్యక్షుడు ఖాసిం జోమార్ట్ తోకాయెవ్‌లతో సమావేశం కావడం విశేషం. పుతిన్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరల్ గా మారింది.
రష్యాలోని అంతర్జాతీయ ఏఐ సదస్సులో కేరళకు చెందిన ఏళ్ల రౌల్ జాన్ అజు (17) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశాడు. 2026 నవంబర్ 26న (గురువారం) ప్రారంభమైన 'ఏఐ జర్నీ 2026' కాన్ఫరెన్స్‌లో ఈ భేటీ జరిగింది. థింక్ క్రాఫ్ట్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించిన రౌల్.. పుతిన్, కజకిస్థాన్ అధ్యక్షుడు ఖాసిం జోమార్ట్ తోకాయెవ్‌లతో సమావేశమైనట్లు రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. సదస్సులోని ప్లీనరీ సెషన్ తర్వాత వీరి మధ్య చర్చ జరిగినట్లు రష్యా మీడియా పేర్కొంది.
భారతదేశ ఏఐ కిడ్‌గా పేరు పొందిన రౌల్.. తొమ్మిదేళ్ల వయసు నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ పొందాడు. ఏఐ రియల్మ్ టెక్నాలజీస్ అనే స్టార్టప్‌ను స్థాపించి 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇచ్చాడు.
పుతిన్ నే ఫిదా చేసిన ఇండియన్ స్టూడెంట్ పుతిన్‌తో భారత విద్యార్థి ఫొటో ముచ్చట ఏమాత్రం బెరుకు లేకుండా పుతిన్‌తో ముచ్చట పుతిన్‌ను కలిసిన భారత విద్యార్థి రౌల్ జాన్ అజు సెల్ఫీ అడగడంతోనే ఫోజు ఇచ్చిన పుతిన్ థింక్క్రాఫ్ట్ ప్లాట్‌ఫామ్‌తో రౌల్ జాన్ అజు సత్తా https://t.co/5xks5qkH1E
— V6 News (@V6News) November 27, 2026
గతంలో తన తండ్రి అడోబ్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అక్కడి ప్రీమియం టూల్స్ ద్వారా టెక్నాలజీని నేర్చుకున్నట్లు రౌల్ చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఎన్ న్యూస్‌తో మాట్లాడుతూ పాఠశాల సైన్స్ ప్రాజెక్ట్ కోసం మీబోట్ అనే రోబోను తయారు చేసినట్లు తెలిపాడు. తన స్టార్టప్‌లో పనిచేస్తున్న తండ్రికి రౌల్ నెలకు రూ.2 లక్షల జీతం ఇస్తున్నాడు. ఏఐ జర్నీ 2026 సదస్సులో భారత్, చైనా, రష్యా, బ్రెజిల్ సహా పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
