హైదరాబాద్: మూసాపేట ట్రక్ యార్డుకు చెందిన భూముల వేలం ప్రక్రియకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూకట్పల్లిలోని ట్రక్ యార్డుకు చెందిన 3.15 ఎకరాల భూములను వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ భూముల వేలానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త కాంతారావు ఈ వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ రెండు పిటిషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీంతో వేలం ప్రక్రియను కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.
వేలానికి తొలగిన అడ్డంకులు
కూకట్పల్లి ట్రక్ యార్డుకు చెందిన 3.15 ఎకరాల భూముల వేలం ప్రక్రియపై న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు కావడంతో వేలంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. పిటిషన్లను కొట్టివేయడంతో వేలం నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్లయింది.
ALSO READ : జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో అగ్నిప్రమాదాల మిస్టరీ..
ఈ భూముల వేలం నేడు(నవంబర్ 27) జరగాల్సి ఉండగా, హైకోర్టు తీర్పుతో ప్రక్రియ కొనసాగించేందుకు మార్గం ఏర్పడింది. 3.15 ఎకరాల భూముల వేలం ద్వారా వచ్చే ఆదాయం, భూముల భవిష్యత్ వినియోగంపై ఆసక్తి నెలకొంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వేలం ప్రక్రియ ఎలా సాగుతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
