రెండో టెస్టులో దక్కని చోటు.. స్టేడియంలోనే ఏడ్చేసిన సిరాజ్?

రెండో టెస్టులో దక్కని చోటు.. స్టేడియంలోనే ఏడ్చేసిన సిరాజ్?

Mohammed Siraj Crying: ఆడించే ఉద్దేశమే లేనప్పుడు.. ఇంత దూరం టూర్‌కు తీసుకెళ్లి బెంచ్‌పై కూర్చోబెట్టడం ఏం న్యాయం?.. క్రైస్ట్‌చర్చ్ టెస్ట్ ప్లేయింగ్ XIలోనూ చోటు దక్కకపోవడంతో మియా భాయ్ ఎమోషనల్ అయిపోయాడా!.. వరుసగా రెండో టెస్టుకూ సిరాజ్‌ను పక్కన పెట్టడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా, టాస్ తర్వాత డగౌట్‌లో నిరాశగా కనిపించిన అతడిని చూసి రహానే, మురళీ కార్తీక్ రియాక్షన్ వైరల్ అవుతోంది. నల్ల కళ్లద్దాల వెనక సిరాజ్ కన్నీళ్లు ఆపుకుంటున్నాడా అని రహానే అడగ్గా, దేశం కోసం ఫుల్ ఎనర్జీతో కొట్టే బౌలర్‌కు ఈ సిచ్యుయేషన్ ఏంటని కార్తీక్ టీమిండియా మేనేజ్‌మెంట్‌ను నిలదీశారు.

అతను ఏడుస్తున్నాడా?.. రహానే, మురళీ కార్తీక్ ఎమోషనల్: 

* క్రైస్ట్‌చర్చ్ టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) కు టెస్ట్ అరంగేట్ర ఛాన్స్ ఇచ్చిన మేనేజ్‌మెంట్, సిరాజ్‌ను మరోసారి పక్కన పెట్టింది. టాస్ తర్వాత డగౌట్ దగ్గర తలదించుకుని, కళ్లద్దాలతో నిశ్శబ్దంగా ఉన్న సిరాజ్‌ను చూసి సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో రహానే, మురళీ కార్తీక్ తీవ్రంగా స్పందించారు. 

* రహానే కలత: నల్ల కళ్లద్దాల వెనుక తన బాధను దాచుకుంటున్న సిరాజ్‌ను చూసి అతను ఏడుస్తున్నాడా? (Is he crying?) అని రహానే భావోద్వేగంతో ప్రశ్నించారు.

* మురళీ కార్తీక్ ఎమోషనల్ కామెంట్స్: సిరాజ్ చాలా ఎమోషనల్ వ్యక్తి.. ఖచ్చితంగా లోపల ఎంతో వేదన అనుభవిస్తుంటాడు. కొందరు డ్రాప్ అయ్యాక ఏమీ పట్టనట్టు ఉంటారు.. కానీ మరికొందరు ఏ త్యాగానికైనా సిద్ధపడి ఆడాలనుకుంటారు. చిన్నపాటి నొప్పి ఉన్నా, జ్వరం ఉన్నా పట్టించుకోకుండా జట్టు కోసం సర్వస్వం ధారబోస్తారు. సిరాజ్ అచ్చం అలాంటి బౌలర్ అని కార్తీక్ కొనియాడారు.

* భారత మేనేజ్‌మెంట్‌కు సూటి ప్రశ్న: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పించారు. వెస్టిండీస్‌తో స్వదేశీ వన్డే సిరీస్‌లోనూ మిగతా బౌలర్లందరికీ రెస్ట్ ఇచ్చిన చివరి మ్యాచ్‌లోనే ఆడించారు. గతంలో అతడి పోరాటాలు చూశాక నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఆడించకూడదని అనుకున్నప్పుడు అసలు స్క్వాడ్‌లోకే ఎంపిక చేయకూడదు. ఫామ్ బాగోలేదనో, నెట్స్‌లో సరిగ్గా బౌలింగ్ చేయడం లేదనో అనిపిస్తే టూర్‌కు తీసుకెళ్లకండి.. అక్కడికి తీసుకెళ్లి ఇలా బెంచ్‌పై కూర్చోబెట్టడం వల్ల ఏం లాభం? అని మురళీ కార్తీక్ ప్రశ్నించాడు. 

ఇంగ్లాండ్‌లో కష్టపడిన బౌలర్‌కు ఇదేనా బహుమతి: 

* గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్టుల సిరీస్‌ను భారత్ 2–2తో సమం చేయడంలో సిరాజ్ ఎన్నో ఓవర్లు అలసట లేకుండా పోరాడాడు. అలాంటి బౌలర్‌ను పక్కన పెట్టి, వెల్లింగ్టన్ తొలి టెస్టులో తేలిపోయిన అన్షుల్ కాంబోజ్ ను కొనసాగించడంపై క్రికెట్ ప్రపంచం భగ్గుమంటోంది. 

* హర్షా భోగ్లే (X): మహమ్మద్ సిరాజ్ ఇప్పుడు భారత్‌లో 6వ ర్యాంక్ ఫాస్ట్ బౌలర్ అయిపోయాడు. ఇది నాకు చాలా అన్యాయంగా అనిపిస్తోంది. ప్రస్తుత WTC సైకిల్‌లో టాప్-5 వికెట్ టేకర్లలో ఉన్న బౌలర్లలో భారత్ ఇప్పుడు కేవలం బుమ్రాకు మాత్రమే చోటిచ్చింది. ఎంపికైన బౌలర్లు బాగా రాణించాలని కోరుకుందాం, కానీ తమ వంతు వచ్చినప్పుడు ఎక్కువ అవకాశాలు దక్కవనే విషయం వారికి అర్థమవుతుంది.

ALSO READ : సాండ్‌పేపర్‌ వివాదంలో మరో ట్విస్ట్..

మహ్మద్ కైఫ్ (X): భారత ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన సిరాజ్‌ను మళ్లీ డ్రాప్ చేయడం నమ్మశక్యంగా లేదు. విదేశీ టెస్టుల్లో బుమ్రాతో పాటు మొదటగా ఉండాల్సిన పేరు సిరాజ్‌దే. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వయంగా సిరాజ్‌ను వరల్డ్ క్లాస్ బౌలర్ అని, బాగా బౌలింగ్ చేస్తున్నాడని పొగిడి కూడా పక్కన పెట్టడం విడ్డూరం.