Gukesh Dommaraju: వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2026 గేమ్-3లో డిఫెండింగ్ ఛాంపియన్ డి గుకేశ్ (D Gukesh) వేసిన స్పీడ్ ప్లాన్ ప్రత్యర్థి జవోఖిర్ సిందరోవ్ (Javokhir Sindarov) కు ముచ్చెమటలు పట్టించింది. కేవలం 2 నిమిషాల్లోనే 15 మూవ్స్ బ్లిట్జ్ చేస్తూ బెర్లిన్ డిఫెన్స్‌లో కొత్త వేరియేషన్‌తో గుకేశ్ ఇచ్చిన ట్విస్ట్‌కు సిందరోవ్ స్టన్ అయ్యాడు. చివరకు ఈ పోరు వరుసగా మూడో డ్రాగా ముగిసినప్పటికీ, ఆరంభంలోనే ప్రత్యర్థి టైమ్ కరిగించి సైకలాజికల్ అప్పర్ హ్యాండ్ సాధించిన గుకేశ్.. ఇప్పుడు గేమ్-4లో వైట్ పీసెస్‌తో అటాక్‌కు రెడీ అవుతున్నాడు.
తెరవెనుక మైండ్ గేమ్స్ ఉంటాయి: గుకేశ్
గేమ్-1లో ఉపయోగించిన బెర్లిన్ డిఫెన్స్ కంటే భిన్నమైన వేరియేషన్‌ను (5...Be7) ఎంచుకున్న గుకేశ్, ఆరంభం నుంచే సిందరోవ్‌పై తీవ్ర ఒత్తిడి పెంచాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సైకలాజికల్ యుద్ధం గురించి ప్రశ్నించగా, 2024 సింగపూర్‌లో డింగ్ లిరెన్‌ను ఓడించినప్పటి నుంచి తన బ్రాండ్‌గా మారిన ప్రశాంతతతో గుకేశ్ ఇలా సమాధానమిచ్చాడు. ఒకే ప్రత్యర్థితో సుదీర్ఘమైన వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తెరవెనుక ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మైండ్ గేమ్స్, ఎదుటివారి కంటే తెలివిగా ఆలోచించడం వంటివి సహజం.. కానీ మీరు చెప్పినట్లు గేమ్ గెలవడమే అన్నింటికంటే ముఖ్యం.. ఓపెనింగ్స్ అనేవి ఆటలో ఒక భాగం మాత్రమేనని గుకేశ్ స్పష్టం చేశాడు.
గుకేశ్ ప్రిపరేషన్ నన్ను ఆశ్చర్యపరిచింది: సిందరోవ్
వైట్ పీసెస్‌తో ఆడినప్పటికీ ఆరంభంలోనే గుకేశ్ వేగానికి, ప్రిపరేషన్‌కు తాను షాక్ అయ్యానని ఛాలెంజర్ జవోఖిర్ సిందరోవ్ బహిరంగంగానే అంగీకరించాడు.
* 5...Be7 మూవ్‌తో షాక్: ఈరోజు నా ప్రత్యర్థి చాలా బాగా ప్రిపేర్ అయి వచ్చాడు.. మేము 5...Be7 మూవ్‌ను పరిశీలించాం కానీ అంత లోతుగా చూడలేదు.. నిజంగా ఆశ్చర్యపోయాను.. నాకు మంచి పొజిషన్ దొరికిందనుకున్నా, కానీ గుకేశ్ ప్రిపరేషన్ అద్భుతంగా ఉందని సిందరోవ్ అన్నాడు.
ALSO READ : రెండో టెస్టులో దక్కని చోటు.. స్టేడియంలోనే ఏడ్చేసిన సిరాజ్?
* టైమ్ ట్రబుల్ టెన్షన్: వైట్‌తో ఆడుతున్నందున గెలిచే అవకాశాల కోసం ప్రయత్నించాను.. ఎండ్‌గేమ్‌లో పొజిషన్ పూర్తిగా సమానంగా ఉందని అర్థమైంది. టైమ్ ట్రబుల్‌లో ఏదైనా తప్పు చేసే పరిస్థితికి చాలా దగ్గరగా వెళ్లాను, కానీ బాగా డిఫెండ్ చేసుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు.
Gukesh to Sindarov after a prolonged fight which ended in a draw in Game 3 of the World Championship - " I'm really sorry about the coughing!" Sindarov - " It's nothing!" https://t.co/IFCdduBNav
— ChessBase India (@ChessbaseIndia) November 26, 2026
