సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి అన్నట్టుగా కేసీఆర్ హరీష్ రావుకు సిద్దిపేటను అప్పగించారని..కానీ, కేసీఆర్ కు వెన్నుపోటు పొడవడం తప్ప హరీష్ రావు ఏం చేయలేదని అన్నారు కవిత.
సిద్దిపేట నా పుట్టినిల్లు లాంటిదని.. తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్దిపేట అండగా నిలిచిందని అన్నారు కవిత. సిద్దిపేట వేదికగా సామాజిక న్యాయం కోసం పోరాటంలో దిగుతున్నానని అన్నారు. సిద్దిపేట మీద ఫోకస్ పెట్టి ఇక్కడ రాజకీయంగా జెండా ఎగురవేస్తున్నామని చెప్పడానికి ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రజలలో ఉండడం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యమని అన్నారు కవిత. తెలంగాణ వచ్చాక సిద్దిపేట కు ఏం జరిగింది అనేది చూడాలని.. సిద్దిపేట జిల్లా లో కేసిఆర్, హరీష్, కొత్త ప్రబాకర్ రెడ్డి ఉన్నారు.. ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
సిద్దిపేటలో ఎన్నో రైస్ మిల్లులు ఉండేవని.. అవి ఇప్పుడు లేవని అన్నారు. ఇక్కడ కొమటోల్లను కొల్లగొట్టే కార్పొరేట్ కంపెనీలు తెచ్చి వారిని గుమస్తాలను చేస్తున్నారని మండిపడ్డారు కవిత. ఇక్కడి అవుసల కులస్తులను ఇబ్బంది పెట్టారని.. తాము అధికారంలోకి వస్తే.. కేవలం అవుసల కులస్తులు తయారు చేసేలా చట్టం తెస్తామని అన్నారు. ఇక్కడి విశ్వబ్రాహ్మణ కులస్తుల ఫోన్ లు ట్యాప్ చేసారని..
భూములు పోతున్నాయని చెప్పి వారు రైతుల దగ్గర భూములు గుంజుకొని ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారని అన్నారు.
