నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. డివైడర్ ను ఢీకొన్న కారులో మంటలు..వ్యక్తి సజీవ దహనం..

నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. డివైడర్ ను ఢీకొన్న కారులో మంటలు..వ్యక్తి సజీవ దహనం..

నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీకొన్న కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనం  అయ్యాడు. నిర్మల్ జిల్లా సోపీనగర్ లో శనివారం ( నవంబర్ 14 ) చోటు చేసుకుంది ఈ ఘటన. కారు వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యారు. 

ఘటన జరిగిన సమయంలో కారులో భారీగా మంటలు చెలరేగాయని..కారులో ఉన్న వ్యక్తిని బయటికి తీసేలోపే సజీవ దహనమయ్యాడని తెలిపారు స్థానికులు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.