IND vs NZ 5th ODI: మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాటింగ్ లైనప్ మరోసారి చేతులెత్తేసింది. నాలుగో వన్డేలో ఓటమి నుంచి కోలుకుని భారీ స్కోరు చేస్తుందనుకున్న టీమిండియా, కేవలం 42.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సిరీస్ సమం చేయాలన్న పట్టుదలతో ఉన్న న్యూజిలాండ్ ముందు 210 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది.
ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ కీలక ఇన్నింగ్స్:
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ లేకపోయినా కివీస్ బౌలర్లు టీమిండియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
నిరాశపరిచిన టాప్ ఆర్డర్: సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5) ఆరంభంలోనే పెవిలియన్ చేరగా.. రుతురాజ్ గైక్వాడ్ (18), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (22), నమన్ ధీర్ (22) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.
ఆదుకున్న ఇషాన్, అక్షర్: జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (46), ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (46) బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. చివర్లో టెయిలెండర్లు అర్ష్‌దీప్ సింగ్ (14), మహమ్మద్ సిరాజ్ (14 నాటౌట్) విలువైన పరుగులు జోడించడంతో భారత్ 200+ పరుగుల మార్కును ధాటింది.
చెలరేగిన కివీస్ బౌలర్లు:
న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత బ్యాటర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (3/47) , పేసర్ జాకబ్ డఫీ (3/60) తలో మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించారు. ఇక మాథ్యూ ఫిషర్ కూడా రెండు వికెట్లు తీయగా, మైఖేల్ బ్రేస్‌వెల్, బ్లెయిర్ టిక్నర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం 2–1 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ ట్రోఫీని కైవసం చేసుకోవాలంటే మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యశ్ ఠాకూర్‌లతో కూడిన భారత బౌలింగ్ విభాగం రాణించాల్సి ఉంది.
Innings Break! After having put to bat first, #TeamIndia are all out for 209 runs in 42.1 overs in the 5th ODI. Scorecard - https://t.co/wqxhoXb2WC #NZvIND https://t.co/OzZxPxZhQZ
— BCCI (@BCCI) November 15, 2026
