Bigg Boss Telugu 10: ఈ వారం వైల్డ్ కార్డ్ బ్యూటీ ఔట్? ఓటింగ్ ట్రెండ్స్‌ను తలకిందులు చేసిన ఎలిమినేషన్..

 Bigg Boss Telugu 10: ఈ వారం వైల్డ్ కార్డ్ బ్యూటీ ఔట్? ఓటింగ్ ట్రెండ్స్‌ను తలకిందులు చేసిన ఎలిమినేషన్..

బిగ్ బాస్ తెలుగు 10: పదో వారంలో బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం దీపావళి సందర్భంగా ఎలిమినేషన్ లేకుండా కంటెస్టెంట్లకు ఊరటనిచ్చిన నాగార్జున.. ఈ వారం మాత్రం ఎవరిని ఇంటి నుంచి బయటకు పంపించబోతున్నారనే ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శ్వేత నాయుడు ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతుండటంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఓటింగ్ ట్రెండ్స్ ఏం చెబుతున్నాయి? శ్వేత నిజంగానే హౌస్‌ను వీడిందా? అలాగే, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అనేది ఓ లుక్కేద్దాం..
 
శ్వేత నాయుడు ఎలిమినేషన్‌తో షాక్?

బిగ్ బాస్ తెలుగు 10లో పదో వారం ఎలిమినేషన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శ్వేత నాయుడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అక్టోబర్ 11, 2026న హౌస్‌లోకి అడుగుపెట్టింది. వచ్చినప్పటి నుంచి తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా వైరల్ అవుతున్న కథనాల ప్రకారం ఈ వారం శ్వేత నాయుడు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉండటంతో శ్వేత బయటకు వెళ్లిందనే ప్రచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. 

ఓటింగ్‌లో ఎవరు టాప్? ఎవరు డేంజర్ జోన్‌లో?

ఈ వారం మొత్తం 12 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. వారిలో ముఖేష్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ వంటి కంటెస్టెంట్లకు సోషల్ మీడియా ఫ్యాన్ పోల్స్‌లో మంచి మద్దతు కనిపిస్తోంది. నవంబర్ 14 శనివారం వరకు ఫ్యాన్ పోల్ ప్రకారం ఓటింగ్ పరిస్థితి ఇలా ఉంది.

    ముఖేష్ గౌడ – 36 శాతం
    త్రిగుణ్ – 12 శాతం
    అమన్ – 9 శాతం
    దేబ్జానీ – 7 శాతం
    నీతూ – 6 శాతం
    వర్షిణి – 5 శాతం
    నరేష్ – 5 శాతం
    రామ్ ప్రసాద్ – 5 శాతం
    సుధీర్ – 5 శాతం
    రామకృష్ణ – 4 శాతం
    శివకుమార్ – 4 శాతం
    శ్వేత నాయుడు – 2 శాతం

ఇలా సోషల్ మీడియాలోని ఫ్యాన్ పోల్‌కు సంబంధించిన ఓటింగ్ లెక్కలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇతర పోలింగ్ వెబ్‌సైట్లలో ఓటింగ్ శాతాలు, కంటెస్టెంట్ల స్థానాలు మారుతూ కనిపిస్తున్నాయి. అందుకే వీటిని ఫైనల్ ఎలిమినేషన్ అంచనాలుగా భావించలేం.

ఈ వారం నామినేషన్లలో ఉన్నది వీళ్లే!

పదో వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన 12 మంది కంటెస్టెంట్లు:

    ముఖేష్ గౌడ
    త్రిగుణ్
    దేబ్జానీ మోదక్
    వర్షిణి సౌందరరాజన్
    అమన్ మసూద్
    నీతూ నటరాజ్
    పుట్టి నరేష్
    ఆటో రామ్ ప్రసాద్
    సుధీర్
    శ్వేత నాయుడు
    రామకృష్ణ
    శివకుమార్

వీరిలో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరి బిగ్ బాస్ ప్రయాణం ముగుస్తుంది? అనేది ఈ వారాంతపు ఎపిసోడ్‌లో తేలనుంది.

ఫ్యామిలీ వీక్‌లో ఎమోషనల్ సీన్స్.. వివాదాలు కూడా!

ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ స్పెషల్ అట్ట్రాక్షన్ గా నిలిచింది. ఇన్నాళ్లూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న కంటెస్టెంట్లను వారి ఆత్మీయులు కలుసుకోవడంతో హౌస్‌లో భావోద్వేగ వాతావరణం కనిపించింది. నరేష్‌కు కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన సర్‌ప్రైజ్, ముఖేష్ తల్లితో జరిగిన భేటీ, అమన్ తండ్రి ఇచ్చిన సలహాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక శ్వేత, వంశీల  కుటుంబ సభ్యుల రాక కూడా చర్చనీయాంశమైంది. మరోవైపు వర్షిణి, రామకృష్ణ కుటుంబ సభ్యుల విషయంలో బిగ్ బాస్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులను కలిసే అవకాశం విషయంలో హౌస్‌మేట్స్‌కు ఇచ్చిన ఎంపికలు, ఎదురైన భావోద్వేగ పరిస్థితులు ప్రేక్షకుల్లో చర్చకు దారితీశాయి.

నాగార్జున హోస్టింగ్.. ఈ వారం ప్రత్యేకత ఏమిటి?

గత వారం దీపావళి సందర్భంగా నాగార్జున నో ఎలిమినేషన్ ప్రకటించడంతో కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ నిర్ణయంతో పదో వారం ఎలిమినేషన్‌పై ఒత్తిడి పెరిగింది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం కూడా మొదలైంది. ఇక నవంబర్ 14న ప్రసారమైన ఎపిసోడ్‌లో నాగార్జున ఎప్పటిలా కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించడంతో పాటు ఇంట్లోని సమస్యలను ప్రస్తావించారు. 'ఐ యామ్ సారీ', 'బిగ్ జీరో' వంటి టాస్కులతో కంటెస్టెంట్ల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి. ఈ ఎపిసోడ్‌లో నరేష్ కెప్టెన్‌గా ఎంపిక కావడం మరో ఆసక్తికర పరిణామం. త్రిగుణ్ ఇచ్చిన ఓటు నరేష్ కెప్టెన్సీకి కీలకంగా మారింది. మరోవైపు వర్షిణికి ఆమె తల్లి రావడంతో ఎమోషనల్ మూమెంట్స్ కనిపించాయి.

డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

గత వారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈ వారం ఇద్దరిని బయటకు పంపించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శ్వేత నాయుడు పేరు మొదటి ఎలిమినేషన్ కోసం వినిపిస్తుండగా, రెండో ఎలిమినేషన్ విషయంలో రామకృష్ణ, శివకుమార్, నీతూ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ వారం ఒక్కరే ఎలిమినేట్ అవుతారా? ఇద్దరిని పంపిస్తారా? అనేది ఇంకా స్పష్టత లేదు.

మొత్తానికి ఈ వారం బిగ్ బాస్‌లో ఏం జరగబోతోంది?

ఒకవైపు ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్, మరోవైపు నామినేషన్ల టెన్షన్.. ఇంకోవైపు శ్వేత నాయుడు ఎలిమినేషన్ ప్రచారం.. ఇలా బిగ్ బాస్ తెలుగు 10 పదో వారం ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ ట్రెండ్స్‌లో కనిపించిన అంచనాలకు భిన్నంగా ఎలిమినేషన్ జరిగిందనే వార్తలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. శ్వేత నాయుడు నిజంగానే హౌస్‌ను వీడిందా? రెండో ఎలిమినేషన్ కూడా ఉంటుందా? నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు? అన్నది అధికారిక ప్రకటనతోనే తేలనుంది.