Aaryavir Sehwag: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా సాధించిన ఆఖరి బంతి థ్రిల్లింగ్ విజయం తర్వాత 15 ఏళ్ల యువ సంచలనం ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag) సంబరాలు అంబరాన్నంటాయి. ఛాంపియన్‌గా నిలిచిన ఆనందంలో తన తండ్రి, భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తో ఆర్యవీర్ మాట్లాడిన వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీరేంద్ర సెహ్వాగ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ తండ్రీకొడుకుల సంభాషణ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
పాక్ స్టాండ్స్ నుంచి సెహ్వాగ్, సెహ్వాగ్ అంటూ నినాదాలు:
* 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ చివరి బంతికి బౌండరీ బాది 1 వికెట్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. తండ్రితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఆర్యవీర్ ఆ ఉత్కంఠ క్షణాలను పంచుకున్నాడు.
* ప్రత్యర్థి ఫ్యాన్స్ నినాదాలకు షాక్: స్టేడియంలోకి అడుగుపెట్టినప్పుడు ప్రత్యర్థి (పాకిస్థాన్) స్టాండ్స్ నుంచి కూడా సెహ్వాగ్, సెహ్వాగ్ అంటూ నినాదాలు రావడం చూసి తాను ఆశ్చర్యపోయానని ఆర్యవీర్ వీరేంద్రుడికి చెప్పాడు.
* టెన్షన్ తట్టుకోవడానికి సీతా రామ్ జపం: చివరి ఓవర్లో విజయానికి 3 పరుగులు అవసరమైన వేళ డ్రెస్సింగ్ రూమ్‌లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో తన టెన్షన్ గురించి చెబుతూ.. చివరి ఓవర్లో నేను సీతా రామ్, సీతా రామ్ అని జపిస్తూనే ఉన్నాను.. ఎలాగైనా ఒక బౌండరీ వస్తే బాగుండు అని అందరం ప్రార్థించాం, లాస్ట్ బాల్ కి అది రానే వచ్చిందని ఆర్యవీర్ ఆనందంతో చెప్పాడు.
గాయాన్ని లెక్కచేయకుండా బ్యాటింగ్:
* ఫైనల్ పోరులో అలీ రజా వేసిన బంతి మోచేతికి (Forearm) బలంగా తాకి గాయమైనప్పటికీ, ఆర్యవీర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 61 బంతుల్లో 9 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. కెప్టెన్ లక్ష్య రాయచందానీతో కలిసి తొలి వికెట్‌కు 95 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
* కోహ్లీ స్టైల్ సెలబ్రేషన్: తన హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే ఆర్యవీర్ బ్యాట్‌తో సంజ్ఞ చేస్తూ.. 2018లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాపై 25వ టెస్ట్ సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీ చేసిన ఐకానిక్ లెట్ మై బ్యాట్ డు ది టాకింగ్ (నా బ్యాటే మాట్లాడుతుంది) సెలబ్రేషన్‌ను రీక్రియేట్ చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు.
Virender Sehwag shared an emotional conversation with son Aaryavir, who recalled chanting “Sita Ram” during the nail-biting final moments. Sehwag expressed pride in his son’s Player of the Tournament achievement and wished him continued success. https://t.co/Oo8X3zkUcC
— Cricketopia (@CricketopiaCom) November 15, 2026
