స్పేస్ ఎక్స్‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ ‘క్యాచ్‌‌‌‌’..అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన స్టార్‌‌‌‌షిప్‌‌‌‌ను.. గాల్లోనే పట్టుకున్న లాంచ్‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌

స్పేస్ ఎక్స్‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ ‘క్యాచ్‌‌‌‌’..అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన స్టార్‌‌‌‌షిప్‌‌‌‌ను.. గాల్లోనే పట్టుకున్న లాంచ్‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌

22 గంటల ప్రయాణం తర్వాత సురక్షితంగా భూమిపైకి 
బూస్టర్‌‌‌‌ పేలుడుతో విఫలమైన డబుల్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ ప్రయోగం
చంద్రుడు, అంగారకుడిపై ప్రయాణాలకు కీలక ముందడుగు

కేప్ కనావెరల్: అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్‌‌‌‌ఎక్స్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. కక్ష్యలోకి వెళ్లి తిరిగి భూమికి చేరుకున్న స్టార్‌‌‌‌షిప్ రాకేట్‌‌‌‌ను లాంచ్ ప్యాడ్‌‌‌‌కు ఉన్న భారీ మెకానికల్ ఆర్మ్స్ గాల్లోనే విజయవంతంగా ఒడిసిపట్టుకున్నాయి. 22 గంటల క్రితం ఎక్కడి నుంచైతే తన ప్రయాణాన్ని ప్రారంభించిందో, సరిగ్గా అక్కడికే నిట్టనిలువుగా దిగింది. అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్న స్టార్‌‌‌‌షిప్‌‌‌‌ను గాల్లోనే పట్టుకోవడం ఇదే తొలిసారి. అయితే, శుక్రవారం టెక్సస్ నుంచి నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ రాకెట్ మొదటి దశ ‘బూస్టర్’గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో పేలిపోయింది. దీంతో ఒకేసారి బూస్టర్‌‌‌‌ను, స్టార్‌‌‌‌షిప్‌‌‌‌ను రెండింటినీ పట్టుకోవాలన్న ఎలాన్‌‌‌‌ మస్క్ బృందం కల కొద్దిలో తప్పింది. కాగా స్పేస్‌‌‌‌ఎక్స్ సాధించిన విజయం పట్ల మస్క్ సైతం తన బృందానికి అభినందనలు తెలిపారు.
భూమి చుట్టూ 14 ప్రదక్షిణలు..
దాదాపు 407 అడుగుల (124 మీటర్లు) ఎత్తున్న ఈ భారీ రాకెట్ శుక్రవారం సాయంత్రం అమెరికా -మెక్సికో సరిహద్దులోని స్పేస్‌‌‌‌ఎక్స్ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. బూస్టర్ నుంచి విడిపోయిన తర్వాత స్టార్‌‌‌‌షిప్ కక్ష్యలోకి ప్రవేశించి 26 అధునాతన స్టార్‌‌‌‌లింక్ శాటిలైట్లను సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ప్రవేశపెట్టింది. భూమికి 265 కిలోమీటర్ల ఎత్తులో 14 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, స్టార్‌‌‌‌లింక్ ద్వారా భూమి ఫొటోలను పంపింది. ఈ స్టార్‌‌‌‌షిప్‌‌‌‌ తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు అత్యంత కీలకమైన ‘హీట్ షీల్డ్’సహా అన్ని వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయి. 
2023 నుంచి స్టార్‌‌‌‌షిప్‌‌‌‌కు ఇది 15వ ప్రయోగం కాగా, కక్ష్యలోకి వెళ్లడం ఇది రెండోసారి.

  • నాసా హర్షం.. తదుపరి లక్ష్యం చంద్రుడు, మార్స్..

స్టార్‌‌‌‌షిప్ పూర్తిస్థాయి పునర్వినియోగానికి ఈ విజయం నిదర్శనమని, తద్వారా తక్కువ ఖర్చుతో వేగంగా అంతరిక్ష యాత్రలు చేయవచ్చని స్పేస్‌‌‌‌ఎక్స్ పేర్కొంది. ఈ విజయంపై నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌‌‌‌మన్ స్పందిస్తూ, ఇది ఒక మాయాజాలంలా ఉంది.. మనం లక్ష్యానికి మరింత చేరువయ్యాం అని ‘ఎక్స్’లో హర్షం వ్యక్తం చేశారు.

ఈ దశాబ్దం చివర్లో ‘ఆర్టెమిస్’మిషన్ ద్వారా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపేందుకు నాసా బిలియన్ల డాలర్లను వెచ్చిస్తోంది. అక్కడ శాశ్వత స్థావరం నిర్మించడంలో స్టార్‌‌‌‌షిప్ కీలకం కానుంది. మరోవైపు, అంగారకుడిపై ఒక నగరాన్నే నిర్మించాలని మస్క్ కలలు కంటున్నారు. రానున్న కొద్ది నెలల్లో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి కూడా స్టార్‌‌‌‌షిప్ ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. 2028 నాటికి ఆర్టెమిస్-4 ద్వారా మానవులను చంద్రుడిపైకి పంపేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది.