- అమెరికాలో మన వస్తువులపై తగ్గనున్న టారిఫ్..
- ఏప్రిల్‌లోపు తొలి దశ ఒప్పందం మంత్రి గోయల్ వెల్లడి
కైరో: అమెరికా మార్కెట్లో పోటీ దేశాలతో పోలిస్తే భారత వస్తువులకు ప్రాధాన్యత లభిస్తుందని, టారిఫ్‌లు తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం తెలిపారు. బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ తొలి దశ డ్రాఫ్ట్‌పై ఫిబ్రవరిలోనే ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య అవగాహన కుదిరిందని ఆయన గుర్తుచేశారు. యూఎస్ సుప్రీంకోర్టు గతంలో ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను కొట్టివేసింది. ఈ మార్పుల వల్ల ఒప్పందంపై తదుపరి చర్చలు జరుగుతున్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తొలి దశ ఒప్పందాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
