మూరుమూల గిరిజనులకు ఉన్ని దుప్పట్లు

మూరుమూల గిరిజనులకు ఉన్ని దుప్పట్లు

హైదరాబాద్, వెలుగు : మూరుమూల గిరిజన ప్రాంతాల్లో చలితో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు అభయ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ ముందుకొచ్చింది. ఆదివారం లోక్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన భగవాన్‌‌‌‌‌‌‌‌ బిర్సా ముండా జయంతి వేడుకల్లో భాగంగా ‘అభయ హంట్‌‌‌‌‌‌‌‌ ది వింటర్‌‌‌‌‌‌‌‌-2026’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా గిరిజనులకు పంపిణీ చేయనున్న 500 ఉన్ని దుప్పట్లతో కూడిన రెడ్‌‌‌‌‌‌‌‌క్రాస్‌‌‌‌‌‌‌‌ వాహనాన్ని గవర్నర్‌‌‌‌‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌‌‌‌‌ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా గవర్నర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా చేసే సేవే నిజమైన సేవని, అభయ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. దుప్పట్ల పంపిణీ ద్వారా గిరిజనులకు భరోసా కల్పిస్తున్నామని అన్నారు. యువత గిరిజన గ్రామాలను సందర్శించి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు 4,000 దుప్పట్లు పంపిణీ చేయనున్నట్లు ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థాపకుడు స్వామి బాలచంద్ర తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌ సీఎస్‌‌‌‌‌‌‌‌ దానకిశోర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.