అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో కలిసి జిల్లాలో కొత్తగా మంజూరైన 13,913 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, త్వరలో అదనంగా మరో 2,000 ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 18,955 దరఖాస్తులు రాగా, 13,913 మందిని అర్హులుగా గుర్తించామని, మిగిలిన అర్హుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విచారణ అనంతరం పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు ఎంతో ఆర్థిక భరోసానిస్తాయన్నారు.