ఇండియాకు 20 ఏళ్లలో.. 500 చిన్నవిమానాలు అవసరం:ఎంబ్రాయర్ కంపెనీ అంచనా

ఇండియాకు 20 ఏళ్లలో.. 500 చిన్నవిమానాలు అవసరం:ఎంబ్రాయర్ కంపెనీ అంచనా

కౌలాలంపూర్: ఇండియా ఏవియేషన్ మార్కెట్ తమకు అతిపెద్ద అవకాశమని బ్రెజిల్ విమానాల తయారీ కంపెనీ ఎంబ్రాయర్  పేర్కొంది. అదానీ గ్రూప్‌‌‌‌తో కలిసి భారత్‌‌‌‌లో రీజినల్‌‌‌‌ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. 

రాబోయే 20 ఏళ్లలో భారత్‌‌‌‌కు 80 నుంచి 146 సీట్ల సామర్థ్యం గల కనీసం 500 చిన్న విమానాలు అవసరమవుతాయని అంచనా వేసింది.  భారత్‌‌‌‌లో నేరుగా విమాన సేవలు లేని 1,200 రూట్లు ఉన్నాయని, వీటిలో 90శాతం రూట్లు 500 కి.మీ కంటే ఎక్కువ దూరం, 100 మంది కంటే తక్కువ ప్రయాణికులు ఉండేవి ఉన్నాయని ఎంబ్రాయర్ ఆసియా- పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ రౌల్ విల్లరాన్ తెలిపారు. 

ఈ విభాగంలో తమ 'ఈ2' జెట్ విమానాలు సరిగ్గా సరిపోతాయని చెప్పారు.  మరోవైపు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన రూ. 28,840 కోట్లతో మాడిఫైడ్  ఉడాన్ స్కీమ్‌‌‌‌ను  కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చింది. దీని కింద ప్రాంతీయ అనుసంధానం కోసం తమ 88 సీట్ల 'ఈ175' జెట్‌‌‌‌లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.