డ్యూయల్ డిస్‌ప్లేతో నోకియా కొత్త ఫ్లిప్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో మళ్ళీ ట్రెండ్‌లోకి.. లాంచ్‌ ఎప్పుడంటే ?

డ్యూయల్ డిస్‌ప్లేతో నోకియా కొత్త ఫ్లిప్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో మళ్ళీ ట్రెండ్‌లోకి.. లాంచ్‌ ఎప్పుడంటే ?

నోకియా ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ ఒక కొత్త ఫీచర్ ఫోన్‌ను లాంచ్  చేయబోతుంది. ఈ ఫోన్ కి కంపెనీ HMD 2320 ఫ్లిప్ 4జి అని పేరు పెట్టాలని చూస్తుంది. ఈ ఫోన్ డిజైన్, ఇటీవల విడుదలైన నోకియా 2360 ఫ్లిప్‌కి చాలా వరకు పోలికతో  ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ రెండు ఫోన్‌ల మధ్య అతిపెద్ద తేడా నెట్‌వర్క్ కనెక్టివిటీ.

నోకియా 2360 ఫ్లిప్ ఇప్పటికీ 2G GSM నెట్‌వర్క్‌లకు మాత్రమే సపోర్ట్  చేస్తుండగా, రాబోయే HMD 2320 ఫ్లిప్ 4G, 4G LTE క్యాట్ 4 కనెక్టివిటీతో  వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఫోన్‌లో కొన్ని కొత్త ఫీచర్లు కూడా చూడొచ్చు. 

HMD 2320 ఫ్లిప్ 4G స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, HMD 2320 ఫ్లిప్ 4G లోపల 2.4-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంటుందని అంచనా, ఫోన్ పైన 1.77-అంగుళాల స్క్రీన్ ఇంకా డ్యూయల్ డిస్‌ప్లేలను సూచిస్తుంది. ఆసక్తికరంగా, దీని లోపలి డిస్‌ప్లే నోకియా 2360 ఫ్లిప్ 2.8-అంగుళాల డిస్‌ప్లే కంటే కొద్దిగా చిన్నగా ఉండవచ్చు. ఈ ఫోన్‌లో 0.3-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా.

పర్ఫార్మెన్స్ పరంగా, ఈ ఫోన్ లో యునిసోక్ టి127 చిప్‌సెట్‌,  64MB ర్యామ్, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుందని అంచనా. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్ 32GB వరకు పెంచుకోవచ్చు. ఇదే ప్రాసెసర్‌ను హెచ్‌ఎమ్‌డి టచ్ 4జి &  హెచ్‌ఎమ్‌డి 110 4జి వంటి ఫోన్లలో  కూడా ఉపయోగించారు.

ఈ ఫ్లిప్ ఫోన్లో పవర్ కోసం 1,450mAh బ్యాటరీ, USB టైప్-సి పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చెయ్యొచ్చు, అయితే దీని ఛార్జింగ్ స్పీడ్ 2.75Wగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా, కొత్త HMD 2320 ఫ్లిప్ 4G కనెక్టివిటీతో పాటు SOS సపోర్ట్, పుష్-టు-టాక్,  డాకింగ్ సపోర్ట్ వంటి ఎక్స్ట్రా  ఫీచర్లను కూడా ఉంటాయి.

అదనంగా, ఈ ఫోన్లో రియల్-టైమ్ ట్రాకింగ్‌తో  జీపీఎస్, 2.4GHz వై-ఫై,  బ్లూటూత్ 5.0 సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. ఇతర ఫీచర్లలో ఎఫ్ఎం రేడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్,  ఒకే నానో సిమ్ స్లాట్ ఇచ్చారు.  అయితే ఈ ఫోన్ లాంచ్, ధర వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.