న్యూఢిల్లీ: కోల్ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్ (ఎంసీఎల్) ఐపీఓ ఈ నెల 19న ప్రారంభమై 23న ముగుస్తుంది. ఇష్యూ సైజ్ రూ.9,500 కోట్లు. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా 66.18 కోట్ల షేర్లను విక్రయిస్తుండగా, ఈ నిధులన్నీ కోల్ ఇండియాకే వెళ్తాయి.
యాంకర్ బుక్ నవంబర్ 18న తెరుచుకుంటుంది. షేర్ల కేటాయింపు 25న, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ 27న జరగనుంది. కోల్ ఇండియా వాటాదారులకు 10శాతం, ఉద్యోగులకు 5శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35శాతం వాటా కేటాయించారు.
