స్నీకర్ మార్కెట్ కోసం స్నక్ హుడ్ దేశీ డ్రిప్

స్నీకర్ మార్కెట్ కోసం స్నక్ హుడ్ దేశీ డ్రిప్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  స్నీకర్స్​, యువత ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌పై పెద్ద బ్రాండ్లు దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్​లో నవంబర్ 29న ‘స్నక్‌‌‌‌‌‌‌‌హుడ్‌‌‌‌‌‌‌‌ దేశీ డ్రిప్‌‌‌‌‌‌‌‌’  నిర్వహిస్తున్నాయి. ఈనెల 29న వన్‌‌‌‌‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే ఈ కార్యక్రమం స్నీకర్లు, దుస్తులు, సంగీతం, కళలకు సంబంధించిన బ్రాండ్లు తమ ఉత్పత్తులను యువతకు పరిచయం చేస్తాయి.  

స్నీకర్లకు కొత్త రూపు ఇవ్వడం, సాక్స్‌‌‌‌‌‌‌‌లను ప్రత్యేకంగా అలంకరించడం వంటి వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లతో పాటు ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌, యాక్సెసరీలు, కళలకు సంబంధించిన ప్రదర్శనలూ ఉంటాయి . బ్రాండ్లకు కొత్త వినియోగదారులను చేరుకునే అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.