న్యూయార్క్: ఏఐ చిప్‌ల తయారీ కంపెనీ ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్‌ను తిరిగి నియమించాలని కోరుతూ ప్రారంభమైన ఆన్‌లైన్ పిటిషన్‌కు భారీ మద్దతు లభిస్తోంది. 'స్టాండ్ విత్ జెన్సన్' పేరుతో నడుస్తున్న ఈ బహిరంగ లేఖపై ఇప్పటివరకు 80,533 మంది సంతకాలు చేశారు.
వీరిలో 43,148 మంది షేర్ హోల్డర్లు, 4,562 మంది ప్రస్తుత ఉద్యోగులు, 795 మంది మాజీ ఉద్యోగులు ఉన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ఎపిక్ గేమ్స్ సీఈఓ టిమ్ స్వీనీ సహా పలువురు టెక్ దిగ్గజాలు కూడా మద్దతు తెలిపారు.
పిటిషన్‌లోని ప్రధాన డిమాండ్లు
స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యే వరకు హువాంగ్‌ను సీఈఓగా కొనసాగించాలి. ఒకవేళ ఆయనను దూరంగా ఉంచాలనుకుంటే బోర్డు బలమైన ఆధారాలు చూపాలి.
దర్యాప్తు పరిధి, కాలపరిమితిని వెల్లడించి, తుది నిర్ణయం తీసుకునే ముందు హువాంగ్‌కు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాలి.
బోర్డు ఆందోళనలకు గల ఆధారాలను, ఉద్యోగులు- షేర్ హోల్డర్ల ప్రయోజనాలను ఎలా పరిగణనలోకి తీసుకున్నారో బహిరంగంగా వివరించాలి.
