2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి..లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి..లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, లేనిపక్షంలో సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ లోని బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశఖ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

 రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ, కస్తూరిబాగాంధీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 35 వేల ఉపాధ్యాయ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో ఆప్షన్, వెయిటింగ్ లిస్ట్ విధానాలను అమలు చేసి ఒక్క పోస్టు కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీ కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి.అనంతయ్య, నాయకులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, యాదయ్య, భీమరాజు, రాజేందర్, శివకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.