రోస్టర్‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో మాలలకు తీవ్ర నష్టం : చెన్నయ్య

రోస్టర్‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో మాలలకు తీవ్ర నష్టం : చెన్నయ్య
  • డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 27న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేస్తాం
  • మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ ద్వారా అమలులోకి తీసుకొచ్చిన రోస్టర్‌‌‌‌‌‌‌‌ విధానం కారణంగా మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను సవరించాలని రెండేళ్లుగా పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లోని బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాల, అనుబంధ ఉపకులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్కటి కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజాప్రతినిధులకు గులాబీ పూలు అందజేస్తూ.. మాలలను ప్రేమించండి.. రోస్టర్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను సవరించండి అనే నినాదంతో వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు.

 అయినా ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 27న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌ వద్ద మాలల మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఒకటి నుంచి రెండు శాతం జనాభా కూడా లేని కులాలకు 20 లోపు రోస్టర్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు కేటాయించిన ప్రభుత్వం, 5 శాతం జనాభా ఉన్న మాలలకు మాత్రం 20 లోపు ఒక్క రోస్టర్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ కూడా కేటాయించకపోవడం కుట్రేనని ఆరోపించారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మేడి సరళ, ప్రధాన కార్యదర్శి కె.లలిత, గ్రేటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రధాన కార్యదర్శులు మర్పల్లి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, పాకనాటి జయకుమార్‌‌‌‌‌‌‌‌, సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా కన్వీనర్‌‌‌‌‌‌‌‌ జి.రమేశ్​తదితరులు పాల్గొన్నారు.