హైదరాబాద్లో మరో ఆస్టర్ హాస్పిటల్.. రూ.500 కోట్ల పెట్టుబడి..

హైదరాబాద్లో మరో ఆస్టర్ హాస్పిటల్..  రూ.500 కోట్ల పెట్టుబడి..

హైదరాబాద్​, వెలుగు: ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ హైదరాబాద్ ​కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.500 కోట్లతో 300 బెడ్స్​ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తోంది. 2027 మార్చి నుంచి ఇక్కడ వైద్య సేవలు ప్రారంభమవుతాయి.  సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ ఆజాద్ మూపెన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ వివరాలను వెల్లడించారు. 

కొత్త హాస్పిటల్ అందుబాటులోకి వస్తే నగరంలో ఆస్టర్ నిర్వహిస్తున్న హాస్పిటళ్ల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది. మొత్తం బెడ్స్​ సంఖ్య 1,700 దాటుతుంది. వ్యాపార విస్తరణ కోసం రెండేళ్లలో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ఆజాద్ ​చెప్పారు. కొత్త హాస్పిటళ్ల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్ల ద్వారా 4,400 కొత్త బెడ్స్​ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.