నిహార్ ఇన్ఫో గోల్డ్ సిల్వర్ డాట్ షాప్ షురూ.. డిజిటల్ బంగారం, వెండి సేవల విస్తరణ

నిహార్ ఇన్ఫో గోల్డ్ సిల్వర్ డాట్ షాప్ షురూ.. డిజిటల్ బంగారం, వెండి సేవల విస్తరణ

హైదరాబాద్​, వెలుగు: నగరానికి చెందిన నిహార్ ఇన్ఫో గ్లోబల్ బంగారం, వెండి అమ్మకాల కోసం GoldnSilver.shop పేరుతో ప్లాట్​ఫారమ్​ను ప్రారంభించింది.  ఈ వెబ్​సైట్​ ద్వారా భౌతిక బంగారం, వెండి నాణేలు, బహుమతి ఉత్పత్తులతో పాటు డిజిటల్ గోల్డ్​ను కొనుక్కోవచ్చు.   సంస్థ సొంత బ్రాండ్ కింద విక్రయిస్తున్న వెండి నాణేలకు ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అమ్మకాలకు అనుమతి లభించింది. 

డిజిటల్ బంగారం, వెండి వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఆగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాంట్, ఎంఎంటీసీ -ప్యాంప్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.  ఈ సంస్థలతో డిజిటల్ సిల్వర్ సేవల అనుసంధానం ఇంకా పూర్తికాలేదు. జెరోధాతో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ సేవల అనుసంధానం చివరి దశలో ఉంది.  కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం హెచ్1​లో  రూ.687.84 లక్షల టర్నోవర్​,   రూ.10.18 లక్షల లాభం సాధించింది.