విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ

విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ

కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్ పరిధిలోని అన్నానగర్ వార్డు 3లోని బాలజ్యోతి ప్రభుత్వ పాఠశాలలో శనివారం చిల్డ్రన్స్ డే ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ యూఐ కంటోన్మెంట్ ప్రెసిడెంట్ ఆదిత్య యాదవ్ విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు. 

మన దేశ మొదటి ప్రధాని నెహ్రూ పిల్లల పట్ల ప్రేమ, విద్యా వికాసానికి ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్ యాదవ్, పరమేశ్ బాలమ్రాయ్, మురళి, ఎండీ అస్గర్, శివ ముదిరాజ్, జేపీ బాబు తదితరులు పాల్గొన్నారు.