న్యూఢిల్లీ: అనవసర ఫోన్ కాల్స్, సందేశాలతో ఇబ్బంది పెడుతున్న సంస్థలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు 1.24 లక్షలకు పైగా కనెక్షన్లను నిలిపివేసింది. స్పామ్ రూల్స్పాటించని 374 సంస్థలను ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.
ట్రాయ్ సెప్టెంబర్ క్వార్టర్ రిపోర్ట్ ప్రకారం.. తొలిసారి నిబంధనలు ఉల్లంఘించిన 1,10,325 కనెక్షన్లపై 15 రోజుల పాటు ఔట్‌గోయింగ్ సేవలను ఆపేసింది. పదేపదే తప్పులు చేసిన 13,777 కనెక్షన్లను ఏడాది పాటు డిస్‌కనెక్ట్ చేశారు. 3,725 ఎస్ఎంఎస్ హెడర్లను కూడా బ్లాక్ చేశారు. ఈ మూడు నెలల్లో వినియోగదారుల నుంచి 15.29 లక్షల ఫిర్యాదులు అందాయి. వీటిలో 7.23 లక్షల ఫిర్యాదులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని గుర్తించారు.
ఫిర్యాదుల్లో 92.9 శాతం ట్రాయ్ డీఎన్‌డీ యాప్ ద్వారానే వచ్చాయి. సెప్టెంబర్ 30 నాటికి ఈ యాప్ డౌన్‌లోడ్లు 42.36 లక్షలకు చేరాయి. టెలికం సంస్థలు ఉపయోగిస్తున్న ఏఐ టెక్నాలజీ 1,900 కోట్ల కాల్స్, ఎంఎస్ఎస్లను అనుమానాస్పద స్పామ్‌గా గుర్తించింది. ప్రమోషనల్ కాల్స్‌కు 140 నంబర్ సిరీస్, బ్యాంకింగ్, సేవలకు 1600 సిరీస్ కేటాయించారు.
