మహిళలు, రైతులు, విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క హనుమకొండలో తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించి.. పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కాంగ్రెస్ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి.. మహిళలను వ్యాపారవేత్తలగా తీర్చిదిద్దేందుకు బ్యాంకు రుణాలు సులభంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
ప్రతి నియోజకవర్గానికి ఫిష్ మొబైల్ వ్యాన్ ఇస్తామన్నారు. మహిళలకు లోన్.. బీమా అమలు చేస్తామన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళలకు గుర్తింపు వచ్చిందన్నారు. "అమ్మ చేతి వంట" పేరిట మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. కొత్తగా 4.5 లక్షల మందికి చేయూత స్కీం ద్వారా పెన్షన్లు మంజూరు అయ్యాయని.. .. ఉచిత బస్సుతో గ్రామీణ మహిళల ఖర్చులు తగ్గాయని తెలిపారు.
